Monthly Horoscope September 2022:  సింహరాశిలో శుక్రుడు మరియు సూర్యుడు కలయికతో సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఈ నెల 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అక్కడే ఉన్న బుధుడితో తలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు. అనంతరం శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టించనున్నారు. ఈ నెలాఖరులో కన్యారాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇన్ని అద్భుతమైన యోగాలు ఉన్న ఈ నెలలో ఏ రాశివారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి నెలవారీ జాతకం: ఈ రాశివారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వీరు ఎక్కువ సమయాన్ని సృజనాత్మక మరియు సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు. మీడియా వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం వల్ల మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. వైవాహిక జీవితం అద్బుతంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


వృషభ రాశి మాస జాతకం: కుటుంబంలో సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఓర్పు, సహనంతో వ్యవహారించండి. వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆరోగ్యం పాడై అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. 


మిథునరాశి మాస జాతకం: ఈ రాశివారు ఈ నెలంతా బిజీగా గడుపుతారు.  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ సహచరులు మద్దతు లభిస్తుంది. కుటుంబానికి పెద్ద సమయం కేటాయించలేకపోవచ్చు. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకోసం యోగ, ధ్యానం  చేయడం మంచిది. 


కర్కాటక రాశి మాస జాతకం: మీరు ఈ సమయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. భార్యభర్తల మధ్య సాన్నిహత్యం పెరుగుతుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. 


సింహ రాశి మాస జాతకం: ఈ రాశివారికి సామాజిక, మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీంతో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి లావాదేవీలు కలిసి వస్తాయి.  కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. యోగా ధ్యానం వంటి చేయడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


కన్య రాశి మాస జాతకం: ఈ సమయంలో ఎవరితోనైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబం కొసం సమయం కేటాయించండి. ఈ సమయంలో మీకు ఒత్తిడి, నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. అజాగ్రత్తగా ఉండకండి. 


తులారాశి మాస జాతకం: ఈ సమయంలో మీరు పని కంటే మీ వ్యక్తిగత అభిరుచులపై ఎక్కు వ సమయం కేటాయిస్తారు. వ్యాపారులకు ఈ టైం కలిసి వస్తుంది.  గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశ ఉంది. ఈ సమయంలో వివాహనికి సంబంధించిన చర్చలు జరుగవచ్చు. 


వృశ్చిక రాశి మాస జాతకం: వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.


ధనుస్సు మాస జాతకం: ఈ రాశివారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. చిక్కుకుపోయిన డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది.  కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం  దొరుకుతుంది. 


మకర రాశి మాస జాతకం: ఈ సమయం మకరరాశి వారికి కలిసి వస్తుంది. మీరు కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో పార్టీలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. 


కుంభ రాశి మాస జాతకం: కుంభ రాశి వారికి కొన్ని ఆర్థిక లేదా వ్యాపార సంబంధిత పనులు కొనసాగుతాయి. ఎక్కడో ఇరుక్కుపోయిన డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో పెద్దల సపోర్టు లభిస్తుంది. అంతేకాకుండా అదృష్టం కలిసి వస్తుంది.  మీ లవ్ కు పెద్దవారు ఒప్పుకుంటారు. 


మీన రాశి మాస జాతకం: ఈ రాశివారికి  ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ శ్రమతో ఎలాంటి కష్టమైన పనినైనా పరిష్కరించగల సామర్థ్యం మీకు ఉంటుంది.  కుటుంబ కలహాలు పరిష్కారం కావడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.  


Also Read: Sun Tranit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook