Gajakesari Yoga: ఆస్ట్రాలజీ గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఒకే రాశిలో రెండు గ్రహాలు కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడుతాయి. ఇది ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.  బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. ఇదే రాశిలోకి అక్టోబర్ 09న చంద్రుడు ప్రవేశించాడు. మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజకేసరి రాజయోగం (Gajakesari Yoga) ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి (Taurus): ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వృషభరాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికైనా, పెట్టుబడి పెట్టడానికైనా ఇదే మంచి సమయం. మీకు వివిధ వనరుల ద్వారా డబ్బు సమకూరుతుంది. బిజినెస్ కొత్త కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. దీంతో మీరు భారీగా లాభపడతారు. 
కర్కాటక రాశి (Cancer): ఈ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. పాలిటిక్స్ లో ఉండే వారికి ఈ సమయం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
కుంభ రాశి (Aquairus): కుంభరాశి యెుక్క రెండో ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. విదేశీ వాణిజ్యం చేసేవారి ఆదాయం పెరుగుతుంది. మీరు మణి రాయిని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు. 


Also Read: Mercury transit 2022: తులరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి