COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moon Transit 2023: డిసెంబర్ 11వ తేదీన చంద్రుడు తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఇదే రాశిలో అంగారక గ్రహం కూడా సంచార దిశలో ఉంది. ఈ అంగారకుడు, చంద్రగ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి చాలా దుష్ప్రభావాలు కలిగిస్తుంది. అయితే ఈ రెండు గ్రహాలు జాతకాల్లో బలంగా ఉంటే లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అతి త్వరలోనే చంద్రుడు వృశ్చిక రాశిలో కలవబోతున్నాడు. చంద్రుడు అంగారక గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 


ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహాల కలయిక సమయంలో మంగళ స్తోత్రాన్ని జపించి హనుమంతుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహాలు జాతకంలో బలహీన స్థానంలో ఉంటే తప్పకుండా కొన్ని రెమెడీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం గురుగ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


చంద్ర గ్రహం, గురు గ్రహం కలయిక కారణంగా వృశ్చిక రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి అంతేకాకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక సింహ రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. 


ఈ సమయంలో సింహ రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. వీరికి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఈ రెండు గ్రహాల కలయిక మిధున రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి