2023 New Year Things: హిందువుల లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. మాత లక్ష్మీ అనుగ్రహం ఉంటే జీవితంలో మనిషికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు సంవత్సరారంభాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యక్తికి ఏడాది పొడవునా ఎలాంటి సమస్యలు ఉండవు. నూతన సంవత్సరంలో కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి యెుక్క అనుగ్రహం లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త సంవత్సరంలో ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి..
>> ఏడాది పొడవునా ఇంట్లో సుఖసంతోషాలతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో తులసి మొక్కను నాటండి. ఆస్ట్రాలజీలో తులసి మెుక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉంటుంది. 
>> కొత్త సంవత్సరానికి ముందు ఇంట్లో నెమలి పింఛాన్ని ఉంచండి. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీంతో ఏడాది పొడవునా ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. 
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు కొత్త సంవత్సరంలో ఇంటికి ఓ చిన్న కొబ్బరికాయను తీసుకురండి. దీనిని ఒక గుడ్డలో చుట్టి ఖజానాలో పెట్టండి. దీని వల్ల మీకు ఇంట్లో ధనానికి లోటు ఉండదు. మీకు సుఖసంతోషాలు లభిస్తాయి. 
>> ముత్యాల శంఖంలో అమ్మవారు లక్ష్మి కొలువై ఉంటుందని నమ్ముతారు. కొత్త సంవత్సరం మొదటి రోజు ఇంట్లో ముత్యాల శంఖాన్ని తీసుకురావడం ద్వారా ఆ తల్లి లక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది. 
>> వెండి ఏనుగు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించాలంటే వెండి ఏనుగుని తీసుకురండి. 
>> ఈ సంవత్సరం ప్రారంభంలో గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ వ్యక్తికి డబ్బుకు లోటు ఉండదు. గోమతీ చక్రాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఖజానాలో ఉంచండి.


Also Read: Grah Gochar 2023: జనవరిలో గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.