November Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెల చాలా కీలకమైందిగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో అన్ని రాశుల జాతకంపై శని, రాహు-కేతు గ్రహాలు, శుక్ర గ్రహాల ప్రభావం ఉండనుంది. అందుకే ఈ నవంబర్ నెల జాతకరీత్యా కీలకమైందిగా భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది నవంబర్ నెలలో అతి ముఖ్యమైన గ్రహాల గోచారం ఉంటుంది. నవంబర్ నెల ప్రారంభమౌతూనే శుక్రుడి గోచారం ఆ వెనువెంటనే శని గ్రహం రాశి పరివర్తనం ఇలా ఒకదానివెంట మరొక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 2023 నవంబర్ నెలలో శని, రాహు-కేతువులు, శుక్ర గ్రహాల ప్రభావం మొత్తం 12 రాశులపై స్పష్టంగా కన్పించనుంది. అక్టోబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ భయపడే రాహు కేతువులు గోచారం చేయనున్నారు. ఇక నవంబర్ నెల ప్రారంభంలో శుక్రుడి గోచారం జరగనుంది. నవంబర్ 4వ తేదీన వక్రమార్గంలో ఉన్న శని గ్రహం సక్రమ మార్గం పట్టనున్నాడు. ఈ పరిణామాల ప్రభావం మొత్తం 12 రాశులపై పడనుంది. అదే సమయంలో 4 రాశులకు మాత్రం గ్రహాల ఈ గోచారం లేదా కదలిక అత్యంత శుభప్రదంగా ఉండనుంది. నవంబర్ 12 న దీపావళి కంటే ముందే ఈ నాలుగు రాశుల జీవితాల్లో దీపావళి కాంతులు విరాజిల్లనున్నాయి. అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. జీవితం సుఖమయంగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ప్రతి పనీ సులభంగా పూర్తవుతుంది. 


కన్యా రాశి జాతకులకు నవంబర్ నెల స్వర్ణమయం కానుంది. ఈ రాశి జాతకుల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ప్రేమతో పాటు రోమాన్స్ కూడా వర్ధిల్లుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార నిమిత్తం విదేశీ ప్రయాణం చేయవచ్చు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. 


కుంభ రాశి జాతకులకు నవంబర్ నెల ఊహించని వరాలను ఇవ్వనుంది. పనిచేసేచోట గుర్తింపుతో పాటు గౌరవం లభిస్తుంది. అనుకోనివిధంగా అంటే మీరు ఊహించని మార్గాల్ని డబ్బు వచ్చి పడుతుంది. అదృష్టం తలుపులు తెర్చుకోవడంతో అనుకున్నవన్నీ పూర్తవుతుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. 


మేష రాశి జాతకులకు నవంబర్ నెల శుభసూచకమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగమార్పు కోసం ఎదురుచూస్తుంటే మీ కోరిక నెరవేరవచ్చు. జీవితంలో కీలక మార్పులు రావచ్చు. వ్యాపారంలో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 


వృషభ రాశి జాతకులకు నవంబర్ నెల అత్యంత అదృష్టదాయకంగా ఉంటుంది. జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. పెండింగులో ఉన్న లేదా రావనుకున్న డబ్బులు చేతికి అందడంతో ఆర్ధికంగా కష్టాలుండవు. సేవింగ్స్ కూడా పెరుగుతాయి. పెళ్లికానివారికి మంచి సమయం. వెంటనే పెళ్లి నిశ్చయం కావచ్చు. ఉద్యోగులకు చాలా అనువైన సమయంగా భావిస్తారు.


Also read: Shani Amavasya 2023: ఈ రాశులవారికి అక్టోబర్‌, నవంబర్ నెలలు ఎంతో కీలకం..ఎందుకంటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook