Numerology Calculator: జ్యోతిష్య శాస్త్రం లాగా భవిష్యత్తు జీవితంలో జరగబోయే సమాచారాన్ని ఇంకా ఏ శాస్త్రం చెప్పలేదని అనుకుంటాం. కానీ న్యూమరాలజీ కూడా సులభంగా భవిష్యత్తు స్వభావం, వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. అయితే న్యూమరాలజీ కూడా వ్యక్తుల జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పగలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా సులభం. దీనికోసం మన పుట్టిన తేదీ, నెల అంతేకాకుండా సంవత్సరానికి కూడా అంకెల రూపంలో పేర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలలో 2, 11, 20 తేదీలలో జన్మించిన వ్యక్తులు 2 యొక్క రాడిక్స్ కలిగి ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం అయితే ఈ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాడిక్స్ 5:
రాడిక్స్ 5 నెంబర్ వారు ఆస్తులు వ్యాపారాల పరంగా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు నిర్వహించిన విజయం తప్పకుండా సాధిస్తారు. వ్యాపారాలపరంగా మీ భాగస్వామితో ఊహించని ప్రయోజనాలను కూడా పొందుతారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా కుటుంబంలో సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.


రాడిక్స్ 6:
ఈ నెంబర్ గలవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి అదృష్టాన్ని పొందుతారు. వ్యాపారాల పరంగా కొత్త ప్రణాళికలు రూపొందించి క్రయవిక్రయాల్లో భారీ లాభాలు పొందే అవకాశం కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత లభిస్తుంది.


రాడిక్స్ 7:
ఈ నెంబర్ వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది మీకు ప్రయోజనాలను అందించే విధంగానే ఉంటుంది. ఈ క్రమంలో నిలిచిపోయిన పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వ్యాపారాలపరంగా కూడా లాభాలు పొందుతారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా దక్కుతాయి.


రాడిక్స్ 8:
ఈ నెంబర్ వారికి కూడా ఈ నెల మొత్తం శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లభించి అనుకున్న పనులన్నీ సులభంగా జరుగుతాయి అంతేకాకుండా భూములు, ఆస్తుల పరంగా లాభాలు కూడా పొందవచ్చు. కొత్త కొత్త ప్రణాళికలు వేయడం వల్ల ఆర్థికంగా కూడా చాలా లాభాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అధికారులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి