Palmistry: చేతిపై భద్రయోగముంటే..ఆ వ్యక్తులు ఊహించని డబ్బు..పెద్ద వ్యాపారవేత్తలౌతారు
Palmistry: హిందూ జ్యోతిష్యంలో హస్తరేఖా శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. చేతిలో భద్రయోగం ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో అంతులేని డబ్బు, కీర్తి సంపాదిస్తారు. ఆ వివరాలు మీ కోసం..
హస్తరేఖా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి చేతిపై రేఖలు, వివిధ ఆకృతులు, గుర్తుల ఆధారంగా ఆ వ్యక్తి భవష్యత్, స్వభావం, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఈ రేఖల ఆధారంగానే ఆ వ్యక్తి ఆదాయం, వ్యాపారం, కెరీర్ ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది చేతిలో ఉండే భద్ర యోగం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేతిలో భద్రయోగముంటే..ఆ వ్యక్తి జీవితంలో అంతులేని డబ్బులు, పేరు సంపాదిస్తారు.
చేతిపై భద్రయోగం ఉన్నవాళ్లు సమాజంలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారు. జీవితంలో అంతులేని సంపద, గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. చేతిలో భద్రయోగం ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం.
హస్తరేఖా శాస్త్రం ప్రకారం వ్యక్తి చేతిలో బుధపర్వం పూర్తిగా ఏర్పడి ఉంటుంది. దాంతోపాటు బుధ రేఖ తిన్నగా సన్నగా, లోతుగా ఉంటుంది. ఆ వ్యక్తి చేతిలో భద్రయోగం ఏర్పడుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చేతిలో శశి యోగం ఉన్నవాళ్లు మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు. వీరి వ్యాపారం బుధగ్రహంతో సంబంధమై ఉంటుంది. ఈ వ్యక్తులు వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. స్వభావరీత్యా సాహసికులు, భయం లేనివాళ్లు. వీరి ముందు ప్రత్యర్ధులు నిలువలేరు. ప్రత్యర్ధుల్ని మిత్రులుగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు.
హస్తరేఖా శాస్త్రం ప్రకారం ఒకవేళ బుధ పర్వతంపై చేప ఆకారంలో గుర్తు ఉంటే అలాంటి వ్యక్తి వ్యాపారంలో భారీ విజయాలు సాధిస్తాడు. అంతేకాదు..ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్తగా మారుతాడు. లక్ష్మీదేవి కటాక్షం ఇటువంటి వ్యక్తులపై సదా ఉంటుంది. వీరి వ్యాపారంలో తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. లగ్జరీ జీవితం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. పిసినారితనం అస్సలుండదు.
జ్యోతిష్యం ప్రకారం ఈ జాతకులు చాలా బుద్ధిమంతులు. ఎవరితోనైతే ఈ వ్యక్తులు కాంటాక్ట్ అవుతారో వారికి సహాయం అందించేందుకు సదా సిద్ధంగా ఉంటారు. అత్యంత కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా చేసేస్తారు. కెరీర్‌పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు.
Also read: Budh Gochar 2023: ఈ 4 రాశులవారికి ఇవాళ 7 గంటల్నించి అన్నీ మంచిరోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook