Akshay Tritiya 2023 Rashifal:  ఈసారి అక్షయ తృతీయ నాడు మేషరాశిలో సూర్యుడు, గురుడు, బుధుడు, రాహువు మరియు యురేనస్ అనే 5 గ్రహాల ప్రత్యేక కలయిక ఏర్పడనుంది. దీనినే పంచగ్రహ యోగం అంటారు. ఈ అరుదైన సంఘటన ఏప్రిల్ 22న ఏర్పడబోతుంది. అయితే ఇదే రోజున చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరూ వృషభరాశిలో చాలా మంచి స్థానంలో ఉంటారు. అక్షయ తృతీయ నాడు 5 రాశులవారి  అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం - పంచగ్రహ రాజయోగం మీకు లాభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా బహుమతిని పొందే అవకాశం ఉంది.
కర్కాటక రాశి - అక్షయ తృతీయ కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. పంచగ్రహి యోగం మీ రాశి నుండి పదవ ఇంట్లో ఏర్పడుతుంది. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మీ ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మేషరాశి - ఇదే రాశిలో అక్షయ తృతీయ నాడు ఎన్నో శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మేషరాశి వారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?


సింహ రాశి- అక్షయ తృతీయ నాడు సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. మీకు ఇంటిపెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో మీకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. ఈ సమయంలో మీరు గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. సింహరాశికి చెందిన వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ సంపదిస్తారు. 
వృశ్చిక రాశి - ఈ అక్షయ తృతీయ వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం కొనాలన్నా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఇల్లు లేదా ల్యాండ్ పై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. మీ రాశిలో చంద్రుడు మరియు శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల మీరు మంచి లాభాలను పొందుతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 


Also Read: Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook