Papankusha Ekadashi 2023: ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున పాపాంకుశ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ఏడాది పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 25న వస్తుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మీకు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పవిత్రదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణుడిని భక్తితో ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పాపకుంశ ఏకాదశి యొక్క శుభ సమయం, పూజా విధానం మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏకాదశి శుభ సమయం
అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3.14 గంటలకు ప్రారంభమై 25వ తేదీ మధ్యాహ్నం 12.32 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, అక్టోబర్ 25న పాపకుంశ ఏకాదశి జరుపుకుంటారు.
పారణ సమయం
పాపకుంశ ఏకాదశి ఉపవాస విరమణ సమయం: అక్టోబర్ 26 ఉదయం 6:28 నుండి 08:43 వరకు ఉంటుంది.


పూజా విధానం
పాపకుంశ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని గంగాజలంతో స్నానం చేసి ఉపవాసం ఉండి పసుపు రంగు దుస్తులు ధరించి శ్రీమన్నారాయణుడిని పూజించండి. విష్ణుమూర్తికి పసుపు రంగు పండ్లు, పువ్వులు మరియు స్వీట్లను తప్పకుండా సమర్పించండి. పూజ సమయంలో విష్ణు చాలీసా పఠించడంతోపాటు మంత్రాలను జపించండి. అంతేకాకుండా శ్రద్దతో శ్రీహరిని ఆరాధించండి. చివరిగా హారతి ఇచ్చి ఉపవాసాన్ని విరమించండి. 


Also Read: Trigrahi Yog in Scorpio: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..భవిష్యత్‌లో జరగబోయే ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.