COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pitra Dosh Ke Upay: హిందూ సంప్రదాయంలో దర్శ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. భక్తులంతా ఈ రోజు చంద్రుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..చంద్రుడు మనస్సుకు కారకంగా పరిగణిస్తారు. ఈ రోజు చంద్రభగవాణుడికి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దర్శ అమావాస్య రోజున మరి కొందరు గంగానదిలో స్నానం ఆచరించి..చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారని సమాచారం. దర్శ అమావాస్యను శ్రాద్ధ అమావాస్య అని కూడా అంటారు. ఈ పితృ దోషం నుంచి బయటపడడానికి దానధర్మా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ అమావాస్య రోజున ఏయే పనులు చేయాలో, ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


దర్శ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత:


- పితృ దోషం పోవడానికి.. ఉదయాన్నే స్నానం చేసి తర్పణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పితృ దోషం సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఆశీస్సులు అందుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా లభిస్తుంది. 
 
- అంతేకాకుండా మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే..దర్శ అమావాస్య రోజు చంద్రుడికి ఉపవాసం ఉండడం వల్ల చంద్ర దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే


- అమావాస్య రోజున దెయ్యాలు, ఆత్మల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు చెడు పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


- దర్శ అమావాస్య రోజున ఉపవాసాలు పాటించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు గంగా స్నానం చేసి పేదవారికి వస్తువులను దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. 


Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook