Continue Planet Transits April 2023 Effect: ఈ నెల అంటే ఏప్రిల్ లో చాలా గ్రహాల గోచారముంది. నెల ప్రారంభమవుతూనే శుక్రుడి గోచారం, ఆ తరువాత బుధుడు, సూర్యుడు, గురు గ్రహాల గోచారం ఒకదానివెంట మరొకటిగా ఉంటుంది. ఈ గోచారం శుభ ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా పడుతుంది. ఏప్రిల్ నెలలో ఏకంగా 4 కీలకమైన, శక్తివంతమైన గ్రహాల గోచారం జరగనుంది. 4 గ్రహాలు రాశి పరివర్తనం వల్ల అందరి జీవితాలపై కీలకమైన ప్రభావం పడనుంది. ఈ నెలలో శుక్రుడు, బుధుడు, గురుడు, సూర్యు గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఈ గ్రహాల స్థితి కారణంగా ఏప్రిల్ నెల కొన్ని రాశులకు అమితమైన లాభాల్ని అందిస్తే..కొన్ని రాశులకు మాత్రం కష్టంగా మారనుంది. 2023 ఏప్రిల్ నెలలో గ్రహాల గోచారం ప్రభావం ఏ రాశులపై శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..


కుంభ రాశి


ఏప్రిల్ నెలలో జరగనున్న వివిధ గ్రహాల గోచారం ప్రభావం కుంభరాశిపై విశేషంగా పడనుంది. జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. అన్ని విషయాల్లో స్నేహితుల సహాయం పొందుతారు. బంధువులతో వివాదం తలెత్తవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. సమయానుకూలంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. కెరీర్ అద్భుతంగా ఉండనుంది. 


కర్కాటక రాశి


గ్రహాల గోచారం కారణంగా ఏప్రిల్ నెల కర్కాటక రాశి జాతకులకు లాభాల్ని కలగజేయనుంది. కుటుంబజీవితం చాలా బాగుంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కొత్తవారితో జరిగే పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనం కల్గిస్తుంది. కెరీర్, ఆర్ధిక విషయాల్లో అంతా బాగుంటుంది. 


మీన రాశి


గ్రహాల గోచారంతో మీనరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. ఆకస్మికంగా డబ్బులు వచ్చి పడతాయి. పలు అంశాల్లో కీలక విజయం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కెరీర్ బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. 


వృషభ రాశి


ఈ రాశివారికి ఏప్రిల్ నెలలో జరిగే గ్రహాల గోచారం అద్భుతమైన లాభాన్నిస్తుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలుంటాయి.


మిథున రాశి


గ్రహాల గోచారం ప్రభావంతో మిధున రాశిలో వ్యాపార వర్గాలకు ఈ సమయం అత్యంత శుభసూచకం. ఊహించని లాభాలుంటాయి. వ్యాపారం విస్తరించేందుకు మంచి సమయం. ఉద్యోగస్థులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండదు. అనారోగ్య సమస్యలుంటూ దూరమౌతాయి.


Also Read: Mars transit 2023: మంగళ గ్రహం ప్రభావం, జూలై 1 వరకూ ఆ 4 రాశులకు అంతా డబ్బే


Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook