Purnima In March 2023: హిందూ మతంలో ప్రతి తేదీ, రోజుకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రత్యేకత దేవుళ్లతో ముడిపడి ఉంటుంది. పౌర్ణమి తిథి కూడా మా లక్ష్మితో ముడిపడి ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మి  దేవికి పూజా కార్యక్రమాలు చేస్తే చాలా అమ్మవారి అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెల  7న(ఈ రోజు)  ఫాల్గుణ మాసం పౌర్ణమి వచ్చింది. అయితే ఇదే పండగ రోజున హోలీ పండగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈ రోజూ ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయండి, అదృష్టవంతులవుతారు!
పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి, మీ దగ్గరలో ఉన్న ఆలయంలో ఉసిరి చెట్టుకు నీరు పోయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెట్టు ముందు ధూపం వేసి, దేశీ నెయ్యితో దీపం వెలిగించి, చక్కెర పదార్థాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దాని తర్వాత విష్ణువు, లక్ష్మికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలన్ని దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కూడా తొలగిపోతాయి.


ఈ రోజు 11 పెంకులపై పసుపు రాసి, వాటిని మా లక్ష్మి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఉంచి.. మరుసటి రోజు వాటిని తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని దుకాణంలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.


పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి సువాసనగల అగరబత్తీలు సమర్పించడం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవితంలో కలిగే అడ్డంకుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


ఇంట్లో ఉండే తులసి మొక్కకు దేశీ నెయ్యితో దీపం వెలిగించి, పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ పూజలో భాగంగా తప్పకుండా పుష్పాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి వచ్చే నెలలో పౌర్ణమి వచ్చే వరకు ప్రతిరోజూ తులసిని పూజించండి. ఈ పరిహారం పాటించడం వల్ల జీవితంలో ధనలాభాలు కలుగుతాయి.


నెరవేరని కోరికలు ఉంటే పౌర్ణమి రోజు శివ పార్వతులకు చదనంతో పాటు, తెల్లని పుష్పాలు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చక్కెరతో తయారు చేసి ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించి, మీరు ఉపవాసాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook