Follow These Remedies On Shattila Ekadashi: ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఏకాదశి అనేది విష్ణుదేవుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు. చాలా మంది వైష్ణవ భక్తులు ఆరోజున ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే లేచీ నారాయణుడిని ప్రత్యేకంగా ఆరాధించి తమ భక్తిని చాటుకుంటారు. మన దేశంలో చాలా  మంది శివుడిని, విష్ణువును కూడా పూజిస్తుంటారు. దేవుళ్లను పూజించేటప్పుడు ఏమాత్రం బేధభావం చూపించరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Glowing Skin Tips: గ్లోయింగ్ స్కిన్‌కు ఖరీదైన క్రీమ్స్ అవసరంలేదు.. ఈ ట్రిక్ పాటించండి చాలు..


అయితే.. షట్తిలా ఏకాదశిరోజున ఏపనైన చేస్తే అది వంద రెట్లు మంచి ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మన ఇళ్లలో చాలా మంది వయసు వచ్చాక కూడా పెళ్లి కుదరదు. అదే విధంగా కొందరికి ఉద్యోగాలు రావు. వచ్చిన కూడా ఎదుగుదల లేకుండా ఏదో జీవితం అలా సాగిపోతుంది. ఇదంతా పితృశాపంగా చెబుతుంటారు. అందుకే జీవితంలో అనుకున్న డెవలర్ మెంట్ ఉండక.. దుర్బర జీవితం గడుపుతుంటారు. అయితే.. షట్తిల ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే వీటి నుంచి బైటపడ, మంచి యోగం అనుభవించేందుకు అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 



తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది. షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట. 


షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు


ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..


1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి.  నువ్వులు నెత్తిమీద నుండి కిందకు పడేలా స్నానం చేయాలి.


2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి రాసుకొవాలి. 


3) తిల హోమం- చేయడానికి వీలున్న వాళ్లు తిల హోమం నిర్వహించాలి.


4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట . నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం పళ్లెంలో నీళ్లతో వదలడం.


5) తిలదానం - నువ్వులు కానీ , నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి.


Read More: Weight Loss: వాల్‌నట్స్‌తో కూడా బరువు, BPని తగ్గించుకోవచ్చు..ఇలా చేయండి రోజు..


6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది). ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట.  ఈ పరిహరాలు పాటిస్తే పితృ శాపం తొలగిపోయి వెంటనే మనస్సులోని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.