Rasi Phalalu 2024: త్వరలో కలవబోతున్న బుధుడు, రాహువు... ఈ 3 రాశులకు బ్యాడ్ డేస్ స్టార్ట్...
Horoscope 2024: త్వరలో బుధ, రాహు కలయిక జరగబోతుంది. వీరిద్దరి సంయోగం వల్ల దురదృష్టకరమైన యోగం ఏర్పడబోతుంది. ఇది కొన్ని రాశులవారికి అశుభకరంగా ఉండనుంది.
Rahu Budh Yuti 2024 effect: త్వరలో కొత్త సంవత్సరం మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాలజీని నమ్మే చాలా మంది.. న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందోనని పంచాంగ కర్తలు, జోతిష్కులకు దగ్గరకు వెళ్తూంటారు. గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలికలను లెక్కించడం ఆధారంగా వారు భవిష్యత్తును చెబుతారు. 2024లో ఓ అశుభకరమైన యోగం ఏర్పడుతోంది. మార్చి 07న మీనరాశిలో బుధుడు, రాహువు కలయిక వల్ల ఇది రూపుదిద్దుకుంటుంది. దాని పేరే జడత్వ యోగం. ఇది ఏయే రాశులవారికి ఇబ్బందులను కలిగించనుందో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి యెుక్క ఐదో ఇంట్లో జడత్వ యోగం రూపొందుతోంది. ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉంటుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆఫీసులో మీకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఏ పని చేపట్టినా దానిని సక్సెస్ చేయలేరు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు.
మేషరాశి
మేష రాశి యెుక్క పన్నెండు ఇంట్లో జడత్వ యోగం ఏర్పడుతోంది. బుధుడు, రాహువు అశుభ కలయిక వల్ల ఈ రాశి వ్యక్తులకు కొత్త సంవత్సరంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. మీకు ఇతరలతో గొడవలు అయ్యే అవకాశం ఉంది.
మీనరాశి
ఈ రాశి యెుక్క లగ్న గృహంలో జడత్వ యోగం ఏర్పడబోతుంది. ఉద్యోగస్తులు సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. ఇది మీకు బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి.మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విఫలమవుతారు. ఆఫీసులో సహచరులతో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు కోరికలను నెరవేర్చుకోలేరు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Also Read: Jupiter Transit: బృహస్పతి సంచారంతో 4 నెలలు పాటు ఈ రాశులవారికి లాభాలే, లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook