Jupiter Transit: బృహస్పతి సంచారంతో 4 నెలలు పాటు ఈ రాశులవారికి లాభాలే, లాభాలు..

Jupiter Transit 2024: బృహస్పతి గ్రహం రాబోయే 2024లో రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని రాశులవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 12:19 PM IST
Jupiter Transit: బృహస్పతి సంచారంతో 4 నెలలు పాటు ఈ రాశులవారికి లాభాలే, లాభాలు..

 

Jupiter Transit 2024: జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి రాశి సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. జాతకంలో ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. ఈ గ్రహం రాబోయే సంవత్సరంలోని 4 నెలల పాటు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మే 1న ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024లో మే 1 వరకు ప్రత్యేక ప్రభావం అన్ని రాశులవారిపై అలాగే ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎక్కువగా ప్రభావితమవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సింహ రాశి:
రాబోయే కొత్త సంవత్సరంలో బృహస్పతి గ్రహ సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం కారణంగా సింహ రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో ఈ గ్రహ సంచారం జరగబోతోంది. దీని కారణంగా వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దీంతో పాటు ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జనవరి తర్వాత ఏవైనా కొత్త పనులను ప్రారంభించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాల్లో ఇంతక ముందు ఉన్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే ఈ సింహ రాశివారు రాబోయే 2024 సంవత్సరంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

మిథునరాశి:
మిథునరాశి వారికి బృహస్పతి సంచారం అదృష్టాన్ని పెంచుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేమ జీవితం మరింత మెరుగుపడుతుంది. దీంతో పాటు శృంగారానికి ప్రత్యేక సమయం కూడా లభిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి కూడా ఎప్పుడు పొందలేని శుభవార్తాలు కూడా వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో స్నేహితుల సపోర్ట్‌ కూడా లభిస్తుంది. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

మీన రాశి:
మిథున రాశి వారికి మేషరాశిలో దేవగురువు సంచార దశలో ఉండడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇంతక ముందు వ్యాపారాల్లో పెట్టిన పెట్టబడులన్నీ లాభాలతో తిరిగి వస్తాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఎప్పుడు పొందలేని లాభాలు పొందుతారు. అలాగే భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News