Rahu Ketu Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎదైన గ్రహం రాశి సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహాలుగా పరిణించే రాహువు, కేతువు గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. ప్రస్తుతం రాహువు మేషరాశిలో ఉండగా, కేతువు తులారాశిలో ఉన్నాడు. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29 తర్వాత  రాహువు, కేతువు రాశి తిరోగమనం చేయబోతున్నాయి. అక్టోబర్ 30న రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ తిరోగమనాల కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
సింహ రాశి:

రాహువు-కేతువు గ్రహ సంచారాల కారణంగా సింహ రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపార పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా ఊహించని ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఇది శుభ సమయంగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆరోగ్య విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మేష రాశి:
రాహువు - కేతువుల సంచారాల కారణంగా మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కష్టం లేకుండానే డబ్బు పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో శుభవార్తాలు వింటారు. అంతేకాకుండా వీరు కుటుంబంతో సంతోషంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


తుల రాశి:
ఈ గ్రహాల సంచారం కారణంగా తుల రాశివారికి గోల్డెన్‌ డేస్‌ ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి