హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి లేదా నక్షత్ర పరివర్తనం చెందుతుంటుంది. గ్రహాల రాశి పరివర్తనం, నక్షత్ర పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై కీలకంగా ఉంటుంది. ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాహువు పరివర్తనం గురించి తెలుసుకుందాం. రాహువు ప్రస్తుతం భరణి నక్షత్రంలో ఉన్నాడు. త్వరలోనే అశ్విని నక్షత్రంలో ప్రవేశించనుంది. అశ్విని నక్షత్రంపై రాహువు ఆధిపత్యం కారణంగా..అంటే అశ్విని నక్షత్ర గురువు రాహువు అయినందున..ఈ పరివర్తనం అత్యంత లాభదాయకం కానుంది. ప్రత్యేకించి 3 రాశులపై రాహువు అశ్వినీ నక్షత్ర ప్రవేశం చాలా శుభం కల్గించనుంది. అశ్విని నక్షత్ర ప్రవేశం ఏయే రాశులపై ఎలాంటి లాభాలు కల్గిస్తుందో చూద్దాం.


మిధున రాశి


మిధున రాశి వారికి రాహువు నక్షత్ర పరివర్తనం అత్యంత శుభంగా ఉంటుంది. ఈ జాతకులకు ఆదాయంలో పెరుగుదలు కన్పిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి కీలక పదవులు లభిస్తాయి. ప్రభుత్వపరంగా లాభముంటుంది. రిస్క్‌తో కూడుకున్న పెట్టుబడులతో ప్రయోజనాలుంటాయి.


కర్కాటక రాశి


రాహవు నక్షత్ర పరివర్తనం కర్కాటక రాశివారికి అత్యంత శుభసూచకంగా ఉంటుంది. ఈ జాతకులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు లాభాన్నిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. పెద్దవాళ్లతో పరిచయాలు పెరుగుతాయి. తండ్రితో బంధం బాగుంటుంది. ఒకేసారి ధనలాభం కలుగుతుంది. ఆస్థి సంబంధిత వ్యవహారాలు పరిష్కారమౌతాయి.


కన్యా రాశి


రాహువు నక్షత్ర పరివర్తనం కన్యారాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ జాతకం వారికి భూమి, బిల్డింగులతో లాభముంటుంది. కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్ కొనవచ్చు. పెళ్లికానివారికి నిశ్చయమౌతుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక పూర్తవుతుంది. వ్యాపారం పెంచేందుకు అవసరమైన తోడ్పాటు లభిస్తుంది. 


Also read: Saturn Combust 2023: శని అస్థిత్వం ప్రభావంతో..33 రోజుల వరకూ ఆ 5 రాశులకు తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook