శనిగ్రహం ఇప్పటికే జనవరి 17, 2023న కుంభరాశిలో గోచారమైంది. ఇవాళ జనవరి 30న అస్థిత్వం కోల్పోనుంది. శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల 5 రాశులపై పెను ప్రభావం పడనుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..
మార్చ్ 5వ తేదీన శనిగ్రహం ఉదయించనున్నాడు. అప్పటివరకూ 33 రోజుల పాటు కొన్ని రాశులవారికి తీవ్రమైన కష్టాలు తప్పవు. శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల ఏయే రాశులకు నష్టాలు, సమస్యలుంటాయో తెలుసుకుందాం..
శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల రాశులపై నెగెటివ్ ప్రభావం
మేషరాశి
మేషరాశి జాతకులకు శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో కష్టాలు ఎదురౌతాయి. ఈ జాతకులకు ఉద్యోగ, వ్యాపారంలో సమస్యలు ఎదురౌతాయి. ధనిహాని కలుగుతుంది. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మానహాని కూడా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిపై శని మహాదశ ప్రభావం ఉంటుంది. శని గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదురౌతాయి. ఉద్యోగ, వ్యాపారంలో సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. నష్టాలుంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు పెట్టుకోవద్దు.
సింహరాశి
సింహరాశి జాతకులకు శని గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడవచ్చు. ఆహార విషయాల్లో ధ్యాస అవసరం. జీవిత భాగస్వామితో వివాదం పెట్టుకోవద్దు. ఆర్ధిక హాని కలగవచ్చు. కష్టపడినా ప్రయోజనాలు తక్కువే ఉంటాయి. పెట్టుబడులకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి
శని గ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల వృశ్చిక రాశి జాతకుల సోదర సోదరీమణులు లేదా ఇతర బంధువుల్లో వివాదం రావచ్చు. ఇంట్లో కలహం రావచ్చు. సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆస్థి సంబంధిత విషయాలపై జాగ్రత్త వహించాలి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ధనహాని కలగవచ్చు. కొత్త పనులు ప్రారంభించవద్దు.
కుంభరాశి
కుంభరాశి వారికి శని అస్థిత్వం ప్రబావంతో చాలా జాగ్రత్త అవసరం. కష్టపడి పనిచేయాలి. ఆర్ధిక పరిస్థితి పాడైపోవచ్చు. తిండిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. కుటంబ జీవితంలో నెగెటివ్ పరిస్థితులు రావచ్చు.
Also read: Shani Gochar 2023: గోల్డెన్ లెగ్స్ పై నడుస్తున్న శనిదేవుడు... ఈ రాశులకు అంతులేని మనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook