Rahu Gochar 2023: ఆస్ట్రాలజీలో రాహువును దుష్ట గ్రహం, అంతుచిక్కని గ్రహం అని పిలుస్తారు. రాహు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఎవరి జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటాడో వారు పేరు ప్రఖ్యాతలతోపాటు పాలిటిక్స్ లో రాణిస్తారు. అక్టోబర్‌లో రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. అతడు మేషరాశిని వదిలి మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. రాహు గోచారం కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశి
రాహువు రాశి మార్పు మకరరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాహువు సంచారం మీ రాశి నుండి మూడవ ఇంట్లో జరగబోతుంది. దీని కారణంగా మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీరు ఆస్తి లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విదేశాల నుండి లాభం పొందుతారు. ఫ్యామిలీ సపోర్టుతో మీరు కార్యాన్ని చక్కగా నెరవేరుస్తారు. 
కుంభ రాశి
రాహువు సంచారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాహు గ్రహం మీ జాతకంలో సంపదల ఇంట్లో సంచరించనున్నాడు. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీకు కొత్త జాబ్ వస్తుంది.  బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. 
వృశ్చిక రాశి
రాహు సంచారం వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ జాతకంలోని ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా అనుకోకుండా ధనం మీ చేతికి చిక్కుతుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీరు మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 


Also Read: Mars transit 2023: మరో 5 రోజుల్లో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook