Rahu Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు నెల లేదా అంతకంటే ఎక్కువ ఒక్కోసారి రెండున్నరేళ్లు కూడా సమయం తీసుకోవచ్చు. ఈ ఏడాది చాలా కీలకమైన గ్రహాలు రాశి మారనున్నాయి. ఇందులో భాగంగానే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత పాపిగా భావించే రాహువు గోచారం సమయం దగ్గరపడింది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు గ్రహ గోచారం ప్రభావం కీలకంగా ఉండనుంది. ఎవరి కుండలిలో అశుభ స్థితిలో ఉంటుందో ఆ వ్యక్తులకు హాని కలగవచ్చు. రాహువు ప్రభావంతో చెడు సాంగత్యానికి అలవాటు పడిపోతారు. అయితే చాలామంది భయపడినట్టుగా రాహువు ఎప్పుడూ చెడు ప్రభావమే చూపించదు. ఎప్పుడూ నష్టాన్నే కల్గించదు. కుండలిలో రాహువు బలమైన స్థితిలో ఉంటే అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇలాంటి వారికి గౌరవ మర్యాదలు సంపూర్ణంగా లభిస్తాయి. అక్టోబర్ 30వ తేదీ మద్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేష రాశి నుంచి మీన రాశిలోకి రాహువు గోచారం ఉంటుంది. మీన రాశిలోకి రాహవు తిరోగమనం చేయనున్నాడు. రాహువు రాశి పరివర్తనం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపించినా మూడు రాశులకు మాత్రం చాలా లాభాలు చేకూర్చనుంది. 


రాహువు గోచారం కారణంగా మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. అక్టోబర్ 30 న ఈ రాశి నుంచే రాహువు మీనంలో మారనున్నాడు. ఇది చాలా ప్రయోజనాలు అందించనుంది. మేష రాశి జాతకులకు ధనలాభం ఉంటుంది. ఏడాది చివరి వరకూ ఆర్ధిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగస్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి.


కర్కాటక రాశి జాతకులకు రాహువు గోచారం ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఇళ్లు , వాహనాలు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. వ్యాపారం విస్తృతం కావచ్చు.పెండింగులో ఉన్న డబ్పులు వచ్చేస్తాయి. కోరుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి.


అక్టోబర్ నెలలో రాహువు మీనరాశిలో ప్రవేశించడంతో ఈ రాశివారికి చాలా లాభం కలగనుంది. కెరీర్‌లో అభివృద్ధి ఉంటుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. ఆదాయం పెరగడంతో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 


Also read: Sun Saturn Rahu Transit 2023: సూర్య, శని, రాహు దుష్ప్రభావంతో సెప్టెంబర్ నెల ఈ రాశులకు ప్రమాదకరం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook