Raksha Bandhan Shubh Muhurat 2022:  సోదరసోదరీమణుల ప్రేమకు ప్రతీక..రక్షాబందన్ లేదా రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ సారి రక్షాబంధన్ (Raksha Bandhan 2022) వేడుకను ఆగస్టు 11 గురువారం నాడు జరుపుకోనున్నారు. హిందూ మతంలో భద్ర ముహూర్తం అశుభమైనదిగా భావిస్తారు. ఈ రోజు పౌర్ణమి తిథి ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 07.05 వరకు ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్ర ముహూర్తం: 
భద్ర పూంచ్ - సాయంత్రం 5:17 నుండి 6.18 వరకు
భద్ర ముఖం - సాయంత్రం 6:18 నుండి రాత్రి 8 వరకు.
భద్ర ముగింపు - రాత్రి 8:51 గంటలకు


భద్ర ముహూర్తంలో రాఖీ ఎందుకు కట్టరు?
మత విశ్వాసం ప్రకారం, భద్ర ముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాన్నిస్తాయి. అందుకే భద్ర కాలంలో సోదరులకు రాఖీ కట్టరు. ఈ సమయంలో రాఖీ కట్టడం అశుభం. పురాణాల ప్రకారం, భద్ర ముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతడు ఏడాదిపాటు ఇబ్బందులు ఎదుర్కోవల్సిందే.  శని దేవుడి సోదరి పేరు కూడా భద్ర అని నమ్ముతారు. భద్రలో మంచి పని చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మా శాపం. అలాగే రాహుకాలంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదు. ఈ రోజున రాఖీని శుభ సమయంలో మాత్రమే కట్టాలి.


Also  Read: Ashoka Plant Benefits: అశోక వృక్షం ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే...! ఏదిశలో నాటాలో తెలుసుకోండి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook