Ashoka Plant Benefits: అశోక వృక్షం ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే...! ఏదిశలో నాటాలో తెలుసుకోండి

Ashoka Plant Benefits: అశోక వృక్షాన్ని హిందూమతంలో పవిత్రమైన మెుక్కగా భావిస్తారు.  దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 04:10 PM IST
Ashoka Plant Benefits: అశోక వృక్షం ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే...! ఏదిశలో నాటాలో తెలుసుకోండి

Vastu tips for Ashoka Plant: చెట్లు, మొక్కలు ఇంటి అందాన్ని పెంచడంతో పాటు వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. అలాంటి మెుక్కలలో అశోక్ష వృక్షం (Ashoka Tree ) ఒకటి.  హిందూమతంలో అశోక వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని ప్రయోజనాలు ఏంటి, దీనిని ఏ దిశలో నాటడం వల్ల శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

అశోక చెట్టు యొక్క ప్రయోజనాలు 
>> అశోక వృక్షం ఇంట్లో ఉండటం వల్ల దుఃఖం, దారిద్ర్యం తొలగిపోతాయి. ఇంట్లో టెన్షన్ లేని వాతావరణం నెలకొని ఆనందం, ఐశ్వర్యం వస్తుంది.
>> అశోక చెట్టును సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై అశోక ఆకులతో తోరణం కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అశోక వృక్షం ఉన్న ఇంటిలో దుష్ట శక్తులు నివాసం ఉండవు.
>> ఇంటి వాస్తు దోషాలను పోగొట్టడంలో అశోక చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. శాస్త్రాల ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం మూలలో అశోక వృక్షాన్ని నాటడం ద్వారా సంపదలు చేకూరుతాయి.
>> అశోక వృక్షం ఉన్న ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం. దీని ఆకులను శుభకార్యాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇంట్లో దీనిని ఉత్తర దిశలో మాత్రమే నాటండి, అప్పుడు మాత్రమే దాని పూర్తి ప్రయోజనం లభిస్తుంది.
>> అశోక వృక్షం వేర్లు పూజా మందిరంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయిని నమ్ముతారు. 

Also Read; Vastu Plant Tips: ఇంట్లో పసుపు మొక్కతో ప్రయోజనాలేంటి, ఏ దిశలో నాటాలి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News