Rakshabandhan 2023: రాఖీ నుంచి ఈ మూడు రాశుల జీవితాలు మారిపోవడం ఖాయం, అంతులేని ధన సంపదలు
Rakshabandhan 2023: శ్రావణ మాసం పూర్తవుతోంది. ఈ నెలలోని పౌర్ణిమ తిధి రోజున రక్షాబంధన్ పండుగ ఉంది. రాఖీ పర్వ దినాన శని గురు గ్రహాల అత్యంత దుర్లభమైన సంయోగం జరగనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Rakshabandhan 2023: శ్రావణమాసంలో రక్షాబంధన్ వేడుక ఈసారి జాతక రీత్యా చాలా ప్రత్యేకం కానుంది. శ్రావణ మాసంలోని పౌర్ణిమ తిధి కావడంతో పాటు అదే శ్రావణ మాసంలోని చివరి రోజు. దీనికితోడు ఆ రోజు శని గురు గ్రహాలు కలిసి దుర్లభమైన సంయోగం ఏర్పర్చనున్నాయి. ఈ పరిణామాలు కొన్ని జాతకాల అదృష్టాన్ని మార్చనున్నాయి.
సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా భావించే రక్షాబంధన్ వేడుక ఈసారి రెండ్రోజులు జరగనుంది. ఆగస్టు 30, 31 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే రాఖీ పండుగ ఈసారి చాలా ప్రత్యేకం కానుంది. రక్షాబంధన్ రోజున శని గురు గ్రహాలు కలిసి దుర్లభమైన సంయోగం ఏర్పర్చనున్నాయి. రక్షాబంధన్ వంటి ప్రత్యేకమైన రోజున శని గురు గ్రహాలు వక్రమార్గం పట్టడం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. రక్షాబంధన్ రోజున సింహ రాశిలో సూర్య-బుధ గ్రహాల యుతి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ అన్ని యోగాలు కలిసి 3 రాశుల అదృష్టాన్ని మార్చేయనున్నాయి. ఈ మూడు రాశులపై అంతులేని ధన సంపదలు కురిపించనుంది.
ధనస్సు రాశి జాతకులకు రక్షాబంధన్ నుంచి అదృష్టం మారిపోనుంది. ఈ రోజున జరిగే గ్రహాల సంయోగం కారణంగా కుటుంబంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి బంధం ఉంటుంది. ఏదైనా యాత్రలకు వెళ్లవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ధనవర్షం కురుస్తుంది. ఉద్యోగ-వ్యాపార వర్గాలకు ఆశించిన మేర వృద్ది కన్పిస్తుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.
మిథున రాశి జాతకులకు రక్షాబంధన్ నుంచి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే చెప్పవచ్చు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పూర్వీకుల సంపద లాభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అన్నింటికంటే మించి మీరు ఆనందించే గుడ్‌న్యూస్ వింటారు.
సింహ రాశి జాతకులకు రక్షాబంధన్ నాడు ఏర్పడే యోగంతో చాలా ప్రయోజనం కలగనుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుత్వాల్లో ఏర్పడిన సమస్యలు దూరమౌతాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండటంతో ఇంట్లో ధనలాభం ఉంటుంది. ఆర్ధికంగా ఎలాంటి కష్టాలుండవు. ఊహించని ధనలాభం కలుగుతుంది. పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జించడం ప్రారంభమౌతుంది.
Also read: Sravana Masam: శ్రావణమాసంలో ఈ రెండు పనులు చేస్తే చాలు..ఊహించని డబ్బులు మీ ఇంట్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook