Sravana Masam: శ్రావణమాసంలో ఈ రెండు పనులు చేస్తే చాలు..ఊహించని డబ్బులు మీ ఇంట్లో

Sravana Masam: హిందూమతంలో శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ నెల చాలా ప్రత్యకం కూడా. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా భావించే శ్రావణంలో కొన్ని పనులు చేస్తే ఏ సమస్యా ఉండదంటారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2023, 11:06 AM IST
Sravana Masam: శ్రావణమాసంలో ఈ రెండు పనులు చేస్తే చాలు..ఊహించని డబ్బులు మీ ఇంట్లో

Sravana Masam: శ్రావణ మాసానికి మరో మూడ్రోజులే మిగిలాయి. ఈ ముూడ్రోజులు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే..ఎప్పటికీ డబ్బులకు కొదవ ఉండదు. అందులోనూ ఈసారి శ్రావణం అధిక మాసం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఏం చేస్తే అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..

హిందూవులకు శ్రావణ మాసం చాలా పవిత్రమైంది. శ్రావణ మాసంలో పూర్తయ్యేందుకు మరో మూడ్రోజులున్నాయి. ఈ మూడ్రోజుల్లో ఈ తులసి ఉపాయాలు ఆచరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శివుడితో పాటు లక్ష్మీదేవి, విష్ణువు కటాక్షం పొందేందుకు తులసి పూజను అత్యంత మహత్యమైందిగా భావిస్తున్నారు. శ్రావణ మాసంలో కొన్ని పూజలు చేయడం వల్ల అన్ని కోర్కెలు నెరవేరనున్నాయి. దాంతోపాటు ఆర్ధిక ఇబ్బందుల్నించి విముక్తి పొందవచ్చు.

శ్రావణ మాసంలో ఇంటి తోట లేదా బాల్కనీలో తులసి మొక్కను నాటడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీరు నాటిన తులసి మొక్క ఆ ఇంటికి శుభప్రదంగా ఉంటుంది. ఆగస్టు 30తో శ్రావణ మాసం ముగియనుంది. అందుకే వెంటనే త్వరపడండి. ఈలోగా తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటితే మంచి ఫలితాలు చూడవచ్చు. అంతేకాకుండా రోజూ తులసి మొక్కకు పూజలు చేసి సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ఉపాయంతో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో డబ్బులకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. తులసి మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్య దిశలోనే నాటాలనే సంగతి మర్చిపోవద్దు. దాంతోపాటు తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోండి. తులసి మొక్కను అపరిశుభ్రమైన చేతులతో ఎప్పుడూ ముట్టుకోవద్దు.

శ్రావణమాసంలో ఇంట్లో అరటి మొక్కను నాటడం కూడా చాలా శుభప్రదం. అరటి మొక్కంటే విష్ణు భగవానుడికి చాలా ఇష్టమని హిందూమతం చెబుతోంది.  అరటి మొక్కను పూజించడం వల్ల కుండలిలో గురుడు పటిష్టమౌతాడు. గురుగ్రహం సుఖ సంతోషాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. అందుకే గురు గ్రహం శుభమైన స్థితిలో ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అందుకే ఈ ప్రయోజనాలు పొందాలంటే శ్రావణంలో ఇంట్లో అరటి మొక్క నాటడం మర్చిపోకూడదు. ఇది చాలా లాభదాయకం. 

Also read: Tulsi Remedies: ప్రతి గురువారం ఇలా చేస్తే మీ ఇంట్లో తులసి డబ్బు కురిపిస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News