Kedar Yoga Benefits: జ్యోతిష్య శాస్త్రంలో కేదార యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఒక వ్యక్తి జాతకంలో ఏ నాలుగు గృహాలలోనైనా ఏడు గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం రూపొందుతుంది. అలాంటి ఆ యోగం సుమారు 500 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 23న ఏర్పడింది. ఈ యోగంలో పుట్టిన వారి జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవు. ఈ యోగ సమయంలో బుధుడు, సూర్యుడు, గురు, రాహు గ్రహాలు మేషరాశిలో, చంద్రుడు, శుక్రుడు మేషరాశిలో, శని కుంభరాశిలో ఉన్నారు. కేదార్ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: సూర్యుడు, బుధుడు, బృహస్పతి మరియు రాహువు గ్రహాలు మేషరాశిలో మొదటి ఇంటిలో కలుస్తాయి. కేదార యోగం వల్ల మేష రాశి వారు ఈసారి మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఈరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 
మకరం: కేదార యోగ ప్రభావం వల్ల మీ జీవితంలోకి సంతోషం వస్తుంది. మీరు భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also read: Surya Gochar 2023: రాబోయే 20 రోజులు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?


సింహం: కేదార యోగం వల్ల సింహ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఈ సమయం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈసారి అదృష్టం మీ వెంటే ఉంటుంది.
ధనుస్సు: కేదార యోప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదాలు ముగుస్తాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కెరీర్ లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Mercury Set 2023: బుధుడు అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం స్వర్గం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook