COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 To 2025 Rasi Phalalu In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాకుండా శని గ్రహాన్ని కూడా ప్రధాన గ్రహంగా పరిగణిస్తారు అయితే చాలామంది శని గ్రహాన్ని ప్రతికూల గ్రహంగా చెప్పుకుంటారు. ప్రతి గ్రహం లాగా ఈ గ్రహం కూడా రాసి సంచారం చేస్తుంది. కానీ అన్ని గ్రహాల్లా కాకుండా రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక రాశి నుంచి ఒక రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ గ్రహం కొన్ని కొన్ని సందర్భాల్లో తిరోగమనస్థితిలో తిరుగుతుంది దీనికి కారణంగా అన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ గ్రహ ప్రభావం వ్యక్తుల కర్మ ఫలితాలను బట్టి కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు నమ్ముతూ ఉంటారు. అయితే రాబోయే 2024 సంవత్సరంలో శని గ్రహం గమనంలో మార్పులు రాబోతున్నాయి దీనికి కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది.


మేషరాశి:
మేష రాశి వారికి 2024 వ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వీరు పోటీ పరీక్షలు రాయడం వల్ల మంచి ర్యాంకులు పొందుతారు.  ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే ఇంతకుముందున్న లాభాల కంటే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి చేసిన పని గాను ఈ సమయంలో ప్రశంసలు కూడా లభిస్తాయి. వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా శృంగారభరితంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


మిధున రాశి:
2024 సంవత్సరంలో మిథున రాశి వారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని దేవుడి అనుగ్రహం లభించి ఈ సమయంలో వ్యాపారాల్లో ఇన్వెస్ట్ కూడా చేస్తారు. దీనికి కారణంగా ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో అనుకోని మార్పులు కూడా వస్తాయి. ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త బైకులు కార్లు కూడా కొనుగోలు చేస్తారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


సింహరాశి:
సింహరాశి వారికి శని దేవుడు అనుగ్రహం లభించి 2024వ సంవత్సరంలో ఎంతో ఆనందంగా జీవిస్తారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం వ్యాపారాల్లో అనేక మార్పులు వచ్చి ప్రమోషన్స్ తో పాటు జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డ వారికి ఉన్నతాధికారుల మద్దతు లభించి అన్ని పనులు సులభంగా చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కూడా చాలా ప్రేమతో ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.


కన్యా రాశి:
కన్య రాశి వారికి 2024 సంవత్సరంలో శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. దీనికి కారణంగా జీవితంలో ఉన్నతంగా జీవించగలుగుతారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు రాయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఆఫీసులలో పనిచేసే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.