Benefits of Ravi Pushya Yog: ఆస్ట్రాలజీలో 27 నక్షత్రాలుగా గురించి చెప్పబడ్డాయి. గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే.. దానిని గురు పుష్య నక్షత్రం అంటారు. ఆదివారం నాడు పుష్య నక్షత్రం వస్తే దానిని రవి పుష్య నక్షత్రం అని పిలుస్తారు. సెప్టెంబర్ నెలలో రవి పుష్య యోగం ఏర్పడబోతుంది. ఈ యాదృచ్ఛికం ఈ నెల 10న ఏర్పడబోతుంది. పైగా ఆ రోజు ఆజ ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సాధారణంగా హిందువులు పుష్య నక్షత్రంలో బంగారం, వెండి, ఆస్తి లేదా కొత్త కారు కొనుగోలు చేస్తారు. రవి పుష్య నక్షత్రం కొన్ని రాశులవారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
రవి పుష్య నక్షత్రం వల్ల తులారాశి వారి వెంట ఎల్లప్పుడు అదృష్టం ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
సింహరాశి 
రవి పుష్య నక్షత్రం సింహ రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
మిథునరాశి
రవి పుష్య యోగం వల్ల మిథునరాశి వారు చాలా ప్రయోజనాలు పొందనున్నారు. మీకు ప్రతి పనిలో అదృష్టంకలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు భారీగా డబ్బును పొదుపు చేస్తారు. మీపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దీంతో మీకు డబ్బుకు లోటు ఉండదు. 


Also Read: Shani Dev: 2024 వరకు ఈ 3 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook