Rich Zodiac Signs: ఈ రాశులవారిపై మాళవ్య రాజయోగం ఎఫెక్ట్.. వీరికి డబ్బే, డబ్బు!
Zodiac Signs Rich: మే 18వ తేదిన మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు విపరీతమైన లాభాలు కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Malavya Raj Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..వైశాఖ శుక్ల పక్ష దశమి తిథి, 18 మే శనివారం ఎంతో శుభప్రదమైన రోజుగా భావించవచ్చు. ఇదే రోజు కుజుడు మేష రాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించబోతోంది. వృషభంలోకి కుజుడు సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన మాళవ్య అనే రాజయోగం ఏర్పడబోతోంది. అయితే జూన్ 12వ తేది వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే మేష రాశి నుంచి సింహ రాశి వరకు ఏయే రాశులువారికి ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి:
మాళవ్య రాజయోగం కారణంగా మేష రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ధనవంతులవుతారు. దీంతో పాటు స్వగృహం కూడా కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అలాగే జీవిత భాగస్వామి నుంచి కూడా సపోర్ట్ లభించి కొత్త ఆదాయ వనరులు పొందుతారు. దీంతో పాటు ఒత్తిడి నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
వృషభ రాశి:
మాళవ్య అనే పంచ మహాపురుష యోగం కారణంగా వృషభ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మానసిక సమస్యల నుంచి కూడా వీరికి విముక్తి కలుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు సంతోషం రెట్టింపు అవుతుంది. మానసిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే భౌతిక అనందం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరికి సృజనాత్మకత కూడా పెరగుతుంది. జీవిత భాగస్వామి నుంచి కూడా ఈ సమయంలో అనేక ప్రయోజనాలు పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథునరాశి:
ఈ ప్రత్యేక యోగం కారణంగా మిథున రాశివారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు విలాస వంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మిథున రాశివారు ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. మీ పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే వీరి సామర్థ్యం పెరుగుతుంది. అయితే వీరు ఈ సమయంలో ఒత్తిడికి గురవుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి ఈ యోగం కారణంగా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. వీరు ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి పూర్వీకుల ఆస్తులు కూడా తిరిగి వస్తాయి. అంతేకాకుండా కళానైపుణ్యం కూడా పెరుగుతుంది. అలాగే ఆనందం కూడా పెరిగి ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మానసి ఆనందం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో సానుకూల పురోగతి లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి