COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sankashti Chaturthi September 2023: భాద్రపద మాసంలో వచ్చే సంకష్ట చతుర్థికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రతి నెల వచ్చే చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం పూర్వీకుల నుంచి ఆనవాయితిగా వస్తోంది. భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని ఇతర రాష్ట్రాల ప్రజలు హేరంబ్‌ సంక్షోభ చతుర్థి అంటారు. ఈ రోజు భక్తులంతా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. దీంతో పాటు శివపార్వతులను కూడా పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం సంకష్ట చతుర్థి 3 సెప్టెంబర్ ఆదివారం రోజు వచ్చింది. ఈ రోజు ఏయే సమయాల్లో వినాయకుడిని పూజించాలో? సంకష్టి చతుర్థి ప్రాముఖ్య ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


సంకష్టి చతుర్థి ప్రాముఖ్యత:
సంకష్టి చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో పాటు జీవితంలో ఆనందం, శాంతి కూడా రెట్టింపు అవుతుంది. విఘ్నహర్త జీవితంలోని ఆర్థిక ప్రయోజనాలను కూడా కలిగిస్తాడని హిందువుల నమ్మకం. అయితే ఈ రోజు ఉపవాసాలు పాటించేవారు తప్పకుండా చతుర్థి తిథిలో చంద్రుడి దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


సంకష్టి చతుర్థి శుభ సమయం:
చతుర్థి ప్రారంభ తేది: సెప్టెంబర్ 02 రాత్రి 08:49 గంటలకు..
చతుర్థి ముగింపు తేదీ: సెప్టెంబర్ 03 సాయంత్రం 06:24 గంటలకు..


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


సంకష్ట చతుర్థి శుభ యోగాలు:
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:55 నుంచి 12:46 సాయంత్రం వరకు
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 02:27 నుంచి మధ్యాహ్నం 03:18 వరకు
గోధూళి ముహూర్తం: సాయంత్రం 06:41 PM నుంచి రాత్రి 07:04 PM వరకు
సర్వార్థ సిద్ధి యోగం: ఉదయం 10:38 నుంచి ఉదయం 06:00


సంకష్టి చతుర్థి పూజా విధానం:
ఈ రోజు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత తల స్నానం చేసి, ఇంట్లో ఉండే గుడిలోని దీపానికి ఒత్తులు వేసి వెలిగించాలి.
గణపతి విగ్రహాన్ని తీసుకుని గంగాజలంతో అభిషేకం చేయాలి. 
గణేషుడికి పూలు సమర్పించి, గరక పోసలతో తయారు చేసిన దండను మొడలో వేయాలి. 
స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. 
ఆ తర్వాత మీరు గణేశుడి శోత్రం చదివి, ఉపవాసం ప్రారంభించాలి.
ఈ వ్రతంలో చంద్రారాధనకు కూడా ప్రాముఖ్యత ఉంది. 
సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి