Sankashti Chaturthi Vrat: ప్రతి శుభకార్యానికి ముందు గణేషున్ని పూజించడం అనవాయితిగా వస్తుంది. అందుకే ప్రతి హిందువు శుభ కార్యానికి ముందు పూజించాలని శాస్త్రం నిపుణులు చోబుతూ ఉంటారు. ఇలా వినాయకున్ని పూజించడం వల్ల పని మధ్యలో ఎలాంటి ఆటకంలైనా తొలగిపోతాయి, కష్టాలు, సంక్షోభాల నుంచి  దూరం చేస్తాడని భక్తులు నమ్ముతారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గణేషున్ని సంకష్టి చతుర్థి రోజున పూజించి ఉపవాసాలు పాటిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భవిష్యత్‌లో వచ్చే కష్టాలన్ని పోయి..కోరికలు నెరవేరుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంవత్సరం పొడవునా చతుర్థి నాడు ఉపవాసాలు పాటించాలి:
సంకష్టి చతుర్థి వ్రతం ఏడాది పొడవునా చాలా మంది ఆచరిస్తారు. పండితిడు రామచంద్ర జోషి సూచించిన వివరాల ప్రకారం.. ప్రతి నెల ఉపవాసాలు పాటించి.. అదే మాసంలో కృష్ణ పక్ష చతుర్థి నాడు కూడా ఉపవాసాలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు. గణేష్ పురాణంలో ప్రముఖ జోతిష్యులు ఈ ఉపవాసం గురించి చెబుతూ... ఈ ఉపవాసంలో అన్ని చతుర్థి ఉపవాసాలు చాలా ముఖ్యమైనవని.. ఎవరైతే దానిని పాటించగలిగితే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.


సంకష్టి చతుర్థి ఉపవాసంలో పూరణాల ప్రకారం వివిధ పద్ధతులు ఉన్నాయి.  గణేష్ పురాణం ప్రకారం..శ్రావన మాసంలో చతుర్థి సమయంలో మోదకాలు తిన్న తర్వాత ఉపవాసం ఉండాలని..భాద్రపద చతుర్థి నాడు కేవలం పాలు మాత్రమే తాగేవారని శాస్త్రం చెబుతోంది. అశ్విన మాస చతుర్థిలో పూర్తి ఉపవాసం పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కార్తీక మాస చతుర్థిలోని మార్గశీర్షంలో కేవలం పాలు తాగి ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా ఉపవాసాలు పాటించడం వల్ల అన్ని కోరికలు తీరడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


గణేష్ పురాణంలో బృశుండి ఋషి కథ ఉంటుంది.  సంకష్తి చతుర్థి నాడు ఉపవాసం పాటించడం వల్ల జీవితంగా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.  భవిష్యత్‌లో వచ్చే అన్ని రకాల ఒడిదుడుగుల నుంచి విముక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కష్టాలన్ని తొలగిపోవాలంటే ఉపవాసాలు తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్


Also Read : Bollywood Affairs: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook