Saturn-Venus Yuti 2023: అంతరిక్షంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఫ్లానెట్స్ యెుక్క రాశి మార్పు కారణంగా కొందరికి అదృష్టం కలిసి వస్తే... మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది . 30 ఏళ్ల తర్వాత అలాంటి అరుదైన సందర్భం అవకాశం ఈ మాసంలో రాబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుంభరాశిలో కల్యాణ దేవుడు శుక్రుడు మరియు న్యాయ దేవుడు శని కలవనున్నాయి. జనవరి 22 నుంచి ఈ రెండు గ్రహాలు కలిసి ఉండనున్నాయి. శుక్రుడు మరియు శని గ్రహాలను మిత్రులుగా భావిస్తారు. 30 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో 2 స్నేహపూర్వక గ్రహాల కలయిక వల్ల 4 రాశుల అదృష్టం అద్భుతంగా ప్రకాశిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి (Capricorn): శనిదేవుడు మరియు శుక్రుడి కలయిక మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి నుండి రెండో ఇంట్లో వీటి సంయోగం ఏర్పడబోతుంది. దీంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోనున్నాడు. మార్కెటింగ్, సేల్స్ మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 
వృషభం (Taurus): ఈ రాశి వారు కొత్త ప్రదేశాలకు వెళ్లి అనేక సౌకర్యాలను అనుభవిస్తారు. శనిదేవుని అనుగ్రహంతో మీరు కొత్త ఉద్యోగం పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 


సింహరాశి (Leo):  మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. బ్రహ్మచారులకు వివాహం జరిగే అవకాశం ఉంది. లైఫ్ పార్టనర్ సపోర్టు దక్కుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోండి. 
మేషరాశి (Aries): శుక్ర మరియు శని కలయికతో  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలం లభిస్తుంది. మీరు వ్యాపారంలో లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. 


Also Read: Makar Sankranti 2023: మకరరాశిలో శత్రు గ్రహాల కలయిక.. ఈరాశుల జీవితం నాశనమే ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook