Saturn Transit in Aquarius 2023: వేద జ్యోతిషశాస్త్రంలో, శని దేవుడు తన కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. శని యొక్క చెడు దృష్టి మీ జీవితాన్ని క్షణాల్లో నాశనం చేస్తుంది. శని అనుగ్రహం ఉంటే అధికారి కూడా రాజు కాగలడు. 2023 సంవత్సరం ప్రారంభంలో శని తన రాశిని మార్చబోతున్నాడు. శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కొందరికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. శని సంచారం ఏ రాశివారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- 2023 సంవత్సరం ప్రారంభంలో శనిగ్రహం యొక్క రాశి మార్పు మేషరాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు.  వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. 
వృషభం (Taurus)- శని సంచారం వల్ల పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోయి మీరు విజయం సాధిస్తారు. కెరీర్‌లో అపారమైన పురోగతిని సాధిస్తారు. మీరు ఉన్నతి పదవి పొందే అవకాశం ఉంది. మీరు అపారమైన డబ్బును పొందుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారులకు ఇదే మంచి సమయం. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. 
మిథునం (Gemini)- శని సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి బాధలన్నీ తొలగిపోతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో లాభం ఉంటుంది. 


తుల రాశి (Libra)- శని సంచారం వల్ల శనిమహాదశ నుండి విముక్తి లభిస్తుంది. కెరీర్ లో పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
ధనుస్సు (Sagittarius)- కుంభరాశిలో శని ప్రవేశించిన వెంటనే ఈ రాశివారిపై శనిమహాదశ తొలగిపోతుంది. వీరి బాధలన్నీ దూరమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shukra Gochar 2022: డిసెంబరు 29న శుక్రుడి చివరి సంచారం... కొత్త ఏడాదిలో వీరికి కష్టాలే కష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook