Shukra Gochar 2022: డిసెంబరు 29న శుక్రుడి చివరి సంచారం... కొత్త ఏడాదిలో వీరికి కష్టాలే కష్టాలు..

Shukra Gochar 2022: డిసెంబరు 29న శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం వల్ల నాలుగు రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 08:40 AM IST
Shukra Gochar 2022: డిసెంబరు 29న శుక్రుడి చివరి సంచారం... కొత్త ఏడాదిలో వీరికి కష్టాలే కష్టాలు..

Shukra Gochar 2022: మరో ఆరు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. సంపదను ఇచ్చే శుక్రుడి యెుక్క సంచారం ఈ నెల చివరిలో జరగనుంది. డిసెంబరు 29న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో ఇప్పటికే శనిదేవుడు ఉన్నాడు. మకరరాశిలో శుక్రుడి యెుక్క సంచారం (Venus Transit 2022) కొన్ని రాశులవారికి చెడు ఫలితాలను ఇస్తుంది. వీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కన్య జాతకం(Virgo Horoscope): శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల కన్యారాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో అడ్డంకులు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావు. మీపై ప్రత్యర్థులు విజయం సాధిస్తారు. 
తుల రాశి జాతకం(Libra Horoscope): డిసెంబర్ 29న ఈ శుక్ర సంచారం తులారాశి వారికి శుభదాయకం కాదు. వీరు ఈ సమయంలో కొనుగోలు చేసే వస్తువులు పాడయ్యే అవకాశం ఉంది. అందుకే కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. 

మకర రాశి జాతకం (Capricorn Horoscope): మకర రాశివారిలో శుక్రుడు సంచారం వల్ల తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అన్నదమ్ముల లావాదేవీలకు సంబంధించి పరస్పరం చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో వ్యవహారించండి. 
మీన రాశి జాతకం (Pisces Horoscope): శుక్రుడి సంచారం వల్ల మీనరాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఉదర సంబంధిత వ్యాధులు మిమ్మిల్ని ఇబ్బంది కలిగిస్తాయి. బిజినెస్ లో మీకు నష్టాలు రావచ్చు. ఉద్యోగులకు సమస్యలు ఎదురువుతాయి. 

Also Read: Shani Dev: శని దోషం ఉన్నవారు ఇలా చేస్తే చాలు.. శాశ్వతంగా దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News