Grah Gochar 2023: గ్రహాల గమనంలో మార్పు కారణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చాయి. జనవరి నెలలో సూర్యభగవానుడు, శని, శుక్రుడు మరియు బుధుడు తమ గమనాన్ని ఛేంజ్ చేశారు. కుంభరాశిలో శని, శుక్రుడు కలిసి ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత శుభ గ్రహ స్థానాల కారణంగా ఒకేసారి 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. సత్కీర్తి, హర్ష, భారతి మరియు వర్షిస్ట్ వంటి పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగం ముఖ్యంగా మూడు రాశులవారికి కలిసి రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజయోగం ఈ రాశులకు అదృష్టం
వృషభం (Taurus): 4 రాజయోగాలు ఏర్పడటం వలన వృషభ రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. వీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. పెళ్లికాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీసులో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. 


తుల రాశి (Libra): 20 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న రాజయోగం తులరాశివారికి గోల్డెన్ డేస్ ను తీసుకువస్తాయి. ఆగిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగంలో లాభం ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. 


ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. ఈరాశి వారు శని సడేసతి నుండి విముక్తి పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఏదైనా ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారికి పదవి లభిస్తుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 


Also Read: Budh Gochar 2023: శని రాశిలో 'బుధుడు' ప్రవేశం.. వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి