Saturn Transit 2023 Effect, Shani Mahadasha begins to these 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకార... ఈరోజు (జనవరి 17న) కుంభ రాశిలోకి శని గ్రహం ప్రవేశించబోతోంది. ఈరోజు రాత్రి 8:02 గంటలకు తన త్రిభుజ రాశి అయిన కుంభ రాశిలోకి శని ప్రవేశిస్తుంది. కొంతమందికి ఈ శని గోచారం నుంచి సడేసతి మరియు ధైయాల నుంచి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో ఈ 4 రాశుల వారికి కష్టాలు ఎక్కువ కానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీన రాశి ప్రజలపై ఈరోజు నుంచి శని గ్రహం యొక్క అర్ధభాగం ప్రారంభం కానుంది. శని మొదటి దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో కుంభ రాశి ప్రజలకు ఈ రోజు నుంచి రెండవ దశ ప్రారంభం కాబోతోంది. ఇది కాకుండా కర్కాటక, వృశ్చిక రాశి వారికి ఈరోజు నుంచి దైయా ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు శని గ్రహ ఆగ్రహానికి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శనీశ్వరుని ఆగ్రహం ఎంతకాలం ఉంటుందో మరియు దాని పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సంవత్సరం కుంభం, మీనం, కర్కాటకం మరియు వృశ్చిక రాశి వారిపై శని దృష్టి ఉంటుంది. శని సడేసతి ఏడేళ్లు,  ధైయా రెండున్నరేళ్లు ఉంటుంది. ఈ సమయంలో ఈ 4 రాశుల వారు తప్పులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేసిన పని తీరుని బట్టే.. ఫలితాన్ని పొందుతారు. శని దేవుడిని కర్మ దాత అంటారు. అతను ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు.


సడేసతి,  ధైయాలను నివారించే మార్గాలు:
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సడేసతి, ధైయాలకు గురయ్యే వ్యక్తులు తమ మధ్య వేలికి ఇనుప ఉంగరాన్ని ధరించాలి. ధరించే ముందు శని దేవుడిని పూజించాలి. ఈ ఉంగరం శనివారం ధరించవచ్చు. ఈసారి శని అమావాస్య జనవరి 21వ తేదీన వస్తోంది. ఆ రోజున ఉంగరం  ధరించడం మంచిది.


# శని ఆగ్రహాన్ని నివారించాలంటే.. శని దేవుడిని పూజించండి. వీలైతే శని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి. ఇది క్రమం తప్పకుండా సాధ్యం కాకపోతే.. ఖచ్చితంగా శనివారం రోజైనా చదవండి. అలాగే శని చాలీసా పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది.


# శని మహాదశతో బాధపడేవారు శనివారం నాడు శని ఆలయానికి వెళ్లి నూనెను దానం చేయండి. ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసుకుని దానం చేయండి. ఇలా చేస్తే మీరు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు.


# శాస్త్రాల ప్రకారం.. సడేసతి మరియు ధైయాతో పోరాడుతున్న వ్యక్తులు శమీ వృక్షాన్ని పూజించాలి. శమీ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి. శని దేవుడికి శమీ వృక్షం చాలా ప్రీతికరమైనది.


# సడేసతి మరియు ధైయా యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నట్లయితే.. శని రక్ష కవచాన్ని పఠించండి. శని దేవుడి నుంచి రక్షణ కోసం ప్రార్థించండి.


Also Read: Akhand Samrajya RajYog 2023: అఖండ సామ్రాజ్య రాజయోగం.. ఈ 3 రాశుల వారికి పండగే పో! రాజు లాంటి జీవితం  


Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కి ఇక చుక్కలే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.