Shani Grah Rashi Sancharam 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తీరోగమనం రాశి సంచారం నక్షత్ర సంచారం చేసినప్పుడు ప్రత్యేక ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది అయితే జాతకంలో శని శుభస్థానంలో ఉన్నవారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం లభించి ఎంత ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి శని కదలికలు కూడా ఎంతో ముఖ్యమైనవని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదే శని గ్రహం జాతకంలో బలహీనంగా ఉంటే వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో పాటు, అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మార్చి 18వ తేదీన శని గ్రహం కుంభరాశిలో కదలికలు జరుపుతూ ఉదయించబోతున్నాడు. దీని కారణంగా రాబోయే 289 రోజులు కొన్ని రాశుల వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.  అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై శని ప్రత్యేక ప్రభావం:
ధనుస్సు రాశి:

దాదాపు 30 సంవత్సరాల తర్వాత శనిగ్రహం కుంభరాశిలో కదలికలను జరపబోతోంది. దీని కారణంగా ధనస్సు రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా వీరికి శని అనుగ్రహం లభించి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు బాస్ సపోర్ట్‌తో ప్రమోషన్స్ కూడా పొందుతారు. అలాగే కెరీర్‌కు సంబంధించిన పనుల్లో కూడా వీరికి క్లారిటీ లభిస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారి కళ ఈ సమయంలో నెరవేరబోతోంది. అయితే వీరు ఆరోగ్యం పై కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిది.


వృషభ రాశి: 
శని ప్రత్యేక ప్రభావం వృషభ రాశి వారిపై కూడా పడబోతోంది. దీనికి కారణంగా వీరికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరి ఆదాయంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు. ఇంట్లో సంతోషం పెరగడమే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కొంత లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి స్నేహితుల మద్దతు లభించి అనేక రకాల లాభాలు కలుగుతాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


తుల రాశి: 
శని కదలికల కారణంగా తులా రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో మిశ్రమ లాభాలతో పాటు మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో సులభంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా శని దేవుడు అనుగ్రహం లభించి ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి