COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Saturn Transit 2024: శని దేవుడిని జ్యోతిష్య శాస్త్రంలో కర్మ దాతగా పిలుస్తారు. అన్ని గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహం చాలా నెమ్మదిగా సంచారం చేస్తుంది. ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అయితే శని గ్రహ సంచారం కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. శని గ్రహం తిరోగమనంతో పాటు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి శని సాడే సతి ప్రభావం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా రాబోయే 2024 సంవత్సరంలో శని గ్రహ తిరోగమనం కారణంగా తప్పకుండా కొన్ని రాశువారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


తులారాశి:
కుంభరాశిలో శని తిరోగమన దశలో తిరగడం కారణంగా తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీవితంపై సానుకూల ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే..ఇంతక ముందు ఉన్నంత ఉత్సహంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


సింహ రాశి:
కుంభరాశిలో శని ప్రత్యేక స్థానంలో ఉండడం వల్ల సింహ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. ప్రేమ జీవితంలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కాబట్టి వీటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. దీంతో పాటు మీ కెరీర్ జీవితంలో అనేక లాభాలు పొందుతారు. 


మేష రాశి:
రాబోయే కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి చాలా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు శని దేవుడి అనుగ్రహం లభించి..అనేక శుభఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక రకాల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు కూడా కలుగుతాయి. 


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook