Saturn Transit: శని నక్షత్ర గోచారంతో ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఎప్పట్నించంటే
Saturn Transit: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది అదే విధంగా గ్రహాలు నక్షత్రాలు కూడా మారుతుంటాయి. ఈ ప్రభావం ఇతర రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Saturn Transit: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల కదలిక ఇతర రాశుల జీవితాలపై ప్రభావం చూపిస్తుందని నమ్మకం. అందుకే ప్రతి నెలా వివిధ గ్రహాల సంచారం, ఏ రాశిలో, ఏ నక్షత్రంలో ప్రవేశమో తెలుసుకుంటుంటారు. గ్రహాలు రాశి మారినట్టే నక్షత్రం కూడా మారుతుంటాయి. అదే విధంగా శని గ్రహం ఇప్పుడు శతభిష నక్షత్రంలో ప్రవేశించనుంది.
జ్యోతిష్యంలో శని గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం ప్రభావంతో అమితమైన లాభాలు, నష్టాలు రెండూ కలగవచ్చు. శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశిస్తుండచంతో 2024లో 3 రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టేనంటారు. ఎందుకంటే గ్రహాలు రాశి లేదా నక్షత్రం మారినప్పుడు అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. కర్మ ఫలదాతగా భావించే శనిగ్రహం నక్షత్రమార్పులో శతభిషంలో ప్రవేశిస్తున్నాడు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. న్యాయదేవతగా భావించే శనిగ్రహం రాహవుతో మిత్రత్వం కారణంగా అంతా లాభదాయకంగా ఉండనుంది. శనిగ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం కారణంగా 3 రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. 2024లో ఈ మూడు రాశుల జీవితాల్లో ఊహించని మార్పు చూడవచ్చు. ధనసంపద అమాంతం పెరుగుతుంది. కెరీర్ అభివృద్ధి చెందుతుంది.
మకర రాశి జాతకులకు శని గ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం కారణంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. చేపటట్టిన పనుల్లో సాఫల్యం ఉంటుంది. ధనసంపదలు కూడగట్టుకుంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. బ్రహ్మచారులకు పెళ్లియోగం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లేదా పదోన్నతి లాభిస్తుంది. ఆరోగ్యం విషంయలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విశేషమేమంటే ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది కలగదు. వ్యాపారులకు లాభాలు ఆర్జించే సమయం ఇది.
మేష రాశి జాతకులకు శనిగ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం కారణంగా ఊహించని లాభంల కలుగుతుంది. ఈ రాశి జాతకులు కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. ఏ వ్యాపారం ప్రారంభించినా అమితమైన లాభాలుంటాయి. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులకు లాభాలు కలగవచ్చు. ఏదైనా సరే కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కన్పిస్తాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
శనిగ్రహం శతభిషంలో ప్రవేశించడం వల్ల వృషభ రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి ఉంటాయి. వ్యాపారులకైతే విశేషమైన లాభాలుంటాయి. కుటుంబం నుంచి ఏదైనా శుభవార్త వింటారు లేదా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృషభ రాశి జాతకులకు అంతా అనుకూలమైన సమయంగా భావించాలి. ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook