Sauramana Ugadi 2023: సౌరమాన పంచగం ప్రకారం.. సౌరమాన ఉగాది అనేది హిందువులు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజును సౌర క్యాలెండర్‌లో భాగంగా మేషాది, వైశాఖది, మేష సంక్రాంతి  అని కూడా అంటారు. అయితే ఈ ఉగాదిని కర్ణాటకలో కొందరు జరుపుకుంటారు. ఈ రోజు సూర్య గ్రహం మేష రాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఏప్రిల్ 14( ఈ రోజును) సౌరమాన ఉగాది అని అంటారు. అంతేకాకుండా కొందరూ మేష సంక్రాంతి అని పిలుస్తారు. అయితే ఈ రోజు విశిష్టత, ప్రాముఖ్యత మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిని తమిళ నూతన సంవత్సరం అని కూడా అంటారా?:
ఈ రోజూ కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఘనంగా సౌరమాన ఉగాదిని జరుపుకుంటారు. అయితే ఈ పండగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. సౌర క్యాలెండర్ ఆధారంగా తమిళనాడులో పుతాండు, పంజాబ్‌లో వైశాఖి, అస్సాంలో బిహు, పశ్చిమ బెంగాల్‌లో నబా బర్షా, ఒరిస్సాలో పానా సంక్రాంతి అని పిలుస్తారు.


సౌరమాన ఉగాది 2023 తేదీ:
సౌరమాన ఉగాది 2023ని ఏప్రిల్ 14 శుక్రవారం జరుపుకుంటారు.


ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.


సౌరమాన ఉగాది ప్రాముఖ్యత:
సౌరమాన ఉగాది ప్రాచీన సంస్కృత గ్రంథాల అద్భుతంగా పేర్కొన్నారు. అయితే ప్రతి సంవత్సరంలో సూర్య గ్రహం మీన రాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయడం వల్ల సౌరమాన ఉగాది ఏర్పుడుతుందని గ్రంథాల్లో తెలిపారు. ఈ రోజు హిందువులంతా ఇళ్లను శుభ్రపరచుకుని పూలు, రంగోలిలతో అలంకరిస్తారు. అంతేకాకుండా భక్తులంతా వారి కుల దైవాలకు పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. సౌరమాన ఉగాది రోజున పిండి పదార్థాలు భోజనంగా తీసుకుంటారు.


నూనెతో స్నాలు చేస్తారు:
సౌరమాన ఉగాది రోజున  నూనె స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజానాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రోజు కొత్త దుస్తువులను ధరించి దేవాలయాలకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు కొత్త ఆస్తులు, గృహాలను కొనుగోలు చేస్తే మంచి లాభాలు కలుగుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook