Shani Asta 2023 effect: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. అనంతరం అదే రాశిలో జనవరి 30న శనిదేవుడు అస్తమించనున్నాడు. శనిదేవుడి యెుక్క సంచారం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. శని అస్తమయం సమయంలో కర్కాటక రాశితో సహా మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మీకు ధననష్టం వాటిల్లే  అవకాశం ఉంది. శనిదేవుడి అస్తమయం ఏ రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి సంచారం ఈ రాశులకు అశుభం
కర్కాటకం (Cancer): శని యొక్క తిరోగమనం కర్కాటక రాశి వారికి వృత్తిలో ఇబ్బందులు ఎదురువుతాయి. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. 
సింహం (Leo): శని యెుక్క అస్తమయం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించుకోండి, లేకపోతే మీ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. మీరు లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  శని అస్తమించడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. 
వృశ్చికం (Scorpio): శని అస్తమించడం వల్ల వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎవరికీ డబ్బు అప్పు ఇవ్వకండి. శనిదేవుడి వక్రదృష్టి నుండి బయటపడాలంటే శని రక్ష కవచ పారాయణం చేయండి. శనిగ్రహం యెుక్క అశుభ ప్రభావం వల్ల మీ తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అందుకే ఈసమయంలో మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని ఆగిపోయే అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2023: మీనరాశిలో శుక్రుడి గోచారం.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి