Shani Dev: శని సాడే సతి ఈ రాశుల వారికి మొదటి, చివరి దశలు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Shani Dev: శని సాడే సతి కారణంగా చాలామంది వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ దశ మొదటి స్థానంలోనే ఉంది. అయితే ఇలాంటి సమయంలో ఈ సాడే సతి ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Shani Dev: జ్యోతిష శాస్త్రంలో శని దేవుని న్యాయదేవతగా ఎందుకు పిలుస్తారో తెలుసా..? అయితే శని ప్రభావం అనేది వ్యక్తుల కర్మ ఫలితాలను బట్టి ఉంటుంది. మనుషులు వ్యక్తిగత జీవితంలో ధర్మ మార్గంలో నడుచుకుంటే శని దేవుడి శుభ ప్రభావం వారిపై ఎఫెక్ట్ చూపుతుంది. అదే జీవితంలో ఇతరులను మోసం చేసే పనులను చేస్తే శని దుష్ప్రభావం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే శని దేవుడిని కర్మ బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయ దేవతగా పిలుస్తారు.
అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారం కూడా ఎంతో ముఖ్యమైన. శని సంచారం చేయడం కారణంగా కొందరి జాతకాలపై శని దేవుడి సాడే సతి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాశి సంచారం చేస్తుంది. శని గ్రహం రాశి సంచారం చేసిన వెంటనే 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతే కాకుండా కొన్ని రాశుల వారిపై శని గ్రహ సాడే సతి ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కుంభ, మీనా, మకర, రాశుల వారిపై శని సాడే సతి ప్రభావం నడుస్తోంది. అయితే శని గ్రహం మళ్లీ రాశి సంచారం చేసే వరకు ఈ సాడే సతి ప్రభావం అలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రభావం నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశి వారికి శని సడే సాతి ప్రభావం 2020 సంవత్సరం జనవరి 24 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ప్రభావం మొత్తం మూడు దశలు ఉంటుంది కాబట్టి 2027 సంవత్సరం జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతుంది. కుంభ రాశి వారికి శని ప్రత్యక్షంగా మారింది కాబట్టి 2028 ఫిబ్రవరి 23 వరకు మాత్రమే శని సాడే సతి ప్రభావం ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
కుంభ రాశి వారికి రెండవ దశ:
ప్రస్తుతం కుంభ రాశి వారికి శని సాడే సతి రెండవ దశ ప్రారంభంలో ఉంది. ఈ సమయంలో వీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ దశ కొనసాగుతున్న వారికి మానసిక సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకొని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది.
ప్రస్తుతం మకర రాశి వారికి శనిసాడే సతి మూడో దశలో కొనసాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చివరి దశగా చెప్పొచ్చు. అయితే మీన రాశి వారికి ఈ ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సాడే సతి నుంచి విముక్తి పొందడానికి ప్రతి శనివారం శని దేవుడి ఆలయం కి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి