Shani Dev Chalisa: శని దేవుడి చెడు ప్రభావం వల్ల 12 రాశువారి జీవితాల్లో చాలా రకాల మార్పులు వస్తాయని తెలిసిందే. అయితే చెడు ప్రభావం వల్ల మనుషుల జీవితాల్లో  చాలా రకాల దుష్ర్పభావాలు వస్తాయి. అంతేకాకుండా చాలా మందిలో అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని గ్రహం జనవరి 17న కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చాలా రాశువారిలో వివిధ రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దుష్ర్పభావాలకు గురయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడి అనుగ్రహం కోసం ప్రతి రోజూ పలు రకాల చర్యలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం మంత్రాలను జపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా "ఓం షన్నో దేవి రబిష్టాయ ఆపో భవన్తు పీపతయే శన్యో రవిశ్ర వంతునాః"  అని జపించాలి.


ముఖ్యంగా బీజ మంత్రాన్ని "ఓం శం శనైశ్చరాయై నమః" అని జపించాలి. దీనితో పాటు శని శాంతి మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో చాలా రకాల మార్పలు రావొచ్చు. కాబట్టి తప్పకుండా శని చెడు ప్రభావం ఉన్నవారు శని మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది.


శని దేవుడి అనుగ్రహం కోసం, ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ మహామృత్యుంజయ జపం చేయాలి.  ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం కూడా తొలగిపోయే ఛాన్స్‌లున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  అకాల మరణ భయం కూడా తగ్గుతుంది.


స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలుపుకుని చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మకర, కుంభ, మీన, మిథున, వృశ్చిక  రాశులవారికి  శని మహాదశలో మార్పులు కూడా సంభవిస్తాయి. అంతేకాకుండా ఎల్లప్పుడు శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి.


శని మహాదశ రాకుండా ఉండాలంటే తప్పకుండా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్


Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి