Shani Dev Mantra: అన్ని దేవతలకు వారి సొంత వాహనాలు ఉన్నాయి. సింహం దుర్గాదేవికి వాహనం అయితే గరుడ మహావిష్ణువు వాహనం ఇలా అన్ని దేవుళ్లకు ఒక్కొక్క వాహనం ఉంటుంది. అయితే శని దేవుడికి కాకే కాకుండా చాలా వాహనాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని దేవుడికి మొత్తం  9 వాహనాలు  ఉన్నాయని గ్రహాలు మారినప్పుడు శని కూడా వాహనం మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశిలో సంచారం చేయడం వల్ల ఎలాంటి వాహనాలు మార్చుకుంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని వాహనాలు:
గేదె:

శని దేవుడు  గేదెను వాహనం చేసుకున్నప్పుడు అన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాడని, గేదెపై స్వారీ చేసినప్పుడు  శక్తివంతంగా శని అవతారం ఎత్తుతాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


గాడిద:
శని దేవుడికి గాడిద కూడా వాహనంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గాడిద శ్రమకు సూచికగా శాస్త్రం పరిగణిస్తుంది. కాబట్టి గ్రహ సంచారం చేసే క్రమంలో గాడిదపై స్వారీ చేయడం వల్ల కష్టపడి విజయాలు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.


రాబందు, కుక్క:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శని రాబందు లేదా కుక్కపై స్వారీ చేయడం వల్ల కూడా మనుషుల జాతకాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా శరీరక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.


గుర్రం:
మీ జాతకంలో శని గుర్రంపై స్వారీ చేస్తే..శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు. గుర్రం ఉత్సాహం, ధైర్యం, విజయానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. .


సింహం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు కాకి మీదే కాకుండా సింహాన్ని కూడా వాహనంగా భావిస్తారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో  ధైర్యం, వివేకానికి సూచికగా పరిగణిస్తారు. కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధించే క్రమంలో సింహ వాహనం సహాయపడుతుంది.


నక్క:
శనిదేవుడు నక్కపై స్వారీ చేయడం అశుభకరమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా రాశులవారి జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్


Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook