Shani Margi 2022 Effects: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కర్మ ఫలాలను ఇచ్చే శనిదేవుడు అక్టోబర్ 23న తన సొంత రాశి అయిన మకరరాశిలో కదలడం ప్రారంభించాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. జనవరి 17, 2023 వరకు శనిదేవుడు ప్రత్యక్ష సంచారంలో (Shani Margi in Makar Rashi 2022) ఉంటాడు. ఈ సమయంలో శష్ మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు శనిదేవుడు.  ఈ రాజయోగం మూడు రాశులవారి అదృష్టాన్ని తెరుస్తుంది. శని ప్రత్యక్ష సంచారం వల్ల లాభపడనున్న ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): వృషభ రాశి వారికి మార్గి శని చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి పనిని త్వరగా పూర్తి చేస్తారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ముఖ్యంగా శనికి సంబంధించిన ఇనుము, నూనె, మద్యం మొదలైన వాటి వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీకు డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది.


తుల (Libra): శని దేవుడి ప్రత్యక్ష సంచారం కెరీర్‌లో పెద్ద పురోగతిని కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా ధనాన్ని ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 


మకరం (Capricorn): శనిదేవుడు మకరరాశిలోనే సంచరించాడు. కావున మకర రాశి వారు శని ప్రత్యక్ష సంచారం వల్ల అధిక ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది.  


Also Read: 2022 November Grah Gochar: 3 రోజుల్లో రాశిచక్రం మారనున్న 2 గ్రహాలు... ఈ రాశులకు డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook