Shani Dev Margi in October 2022: కొన్ని రాశుల వారికి అక్టోబర్ నెల చాలా బాగుంటుంది. వీరికి శనిదేవుడి అనుగ్రహంతో అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెలలో మార్గంలోకి (Shani Dev Margi in October 2022) వస్తాడు. మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. వీరి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఈ రాశులవారికీ దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries) : అక్టోబర్ నెలలో శని మార్గంలో ఉండటం మేషరాశి వారికి మేలు చేస్తుంది. లక్ కలిసి వస్తుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగపడతారు. కుటుంబ పరిస్థితి బాగుంటుంది. 


కర్కాటక రాశి (Cancer): ఈ రాశి వారికి శని దేవుడి మార్గం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. చిక్కుకుపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 


తుల(Libra): మకరరాశిలో శని దేవుడి మార్గం వల్ల తులారాశి వారికి కూడా లాభం చేకూరుతుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా కూడా బాగుంటుంది. 


వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి శని మార్గం శుభప్రదం. ఈ సమయంలో వ్యాపారంలో వృద్ధి, ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. 


మీనం (Pisces): శని సంచారంలో ఉండటం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.  


Also read: Rahu Kethu Dosham: మీ కుండలిలో రాహుకేతు దోషముందా, ఏం చేస్తో పోతుంది 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook