Rahu Kethu Dosham: మీ కుండలిలో రాహుకేతు దోషముందా, ఏం చేస్తో పోతుంది

Rahu Kethu Dosham: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, రాశులకు చాలా మహత్యముంది. ప్రాధాన్యత ఉంది. రాహు, కేతువుల దోషానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి రెమెడీ ఏముందనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 24, 2022, 11:09 PM IST
Rahu Kethu Dosham: మీ కుండలిలో రాహుకేతు దోషముందా, ఏం చేస్తో పోతుంది

Rahu Kethu Dosham: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, రాశులకు చాలా మహత్యముంది. ప్రాధాన్యత ఉంది. రాహు, కేతువుల దోషానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి రెమెడీ ఏముందనేది తెలుసుకుందాం..

హిందూమతంలో జ్యోతిష్యానికి కీలక ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రాహు, కేతువుల ప్రభావం గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావన ఉంది. ఈ రెండు గ్రహాల్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఛాయాగ్రహాలుగా పిలుస్తారు. అదే సమయంలో పాప గ్రహాలని కూడా అంటారు. ఎవరైనా వ్యక్తి కుండలిలో రాహుకేతువుల దోషముంటే..ఆ వ్యక్తులకు జీవితమంతా కష్టాలే. జీవితంలో ఒకదాని వెంట మరొక సమస్య వస్తుంది. రాహుకేతువుల దోషాన్ని దూరం చేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని సూచనలున్నాయి. 

కుండలిలో రాహుదోషముంటే ఆ వ్యక్తికి నిద్ర పట్టదు. కడుపు, మెదడు, ఎముకలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దాంతోపాటు వ్యక్తి చాలా బద్దకస్థుడిగా మారిపోతాడు. రాహు దోషం నుంచి కాపాడుకునేందుకు ముందుగా చెడు అలవాట్లను మానుకోవాలి. ఉపశమనం కలిగే మార్గాల్ని త్వరగా అనుసరించాలి. అటు కుండలిలో కేతువు దోషముంటే..చర్మ రోగాలు, చెవిపోటు సమస్య వస్తుంది. వినికిడి శక్తి కూడా తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులు వంటివి ఎదురౌతాయి.

రాహు కేతువులనేవి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఛాయా గ్రహాలు. వీటి చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు దుర్గాదేవిని పూజించాలి. రాహుకేతువుల దోషం నుంచి విముక్తి పొందేందుకు నాగుపాముపై నృత్యం చేస్తున్న కృష్ణుడి బొమ్మను ముందు పెట్టుకుని...రోజూకు 108 సార్లు ఓమ్ నమహ భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పఠించాలి.

రాహుకేతువుల సమస్య ఉంటే ఏం చేయాలి

రాహుకేతువు గ్రహాలకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయాలి, రోజూ బీజ మంత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల చెడు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు పేద అమ్మాయి పెళ్లికి సహాయం చేయాలి. కుండలిలో రాహుదోషముంటే..తేలికైన నీలిరంగు బట్టలు ధరించాలి. అటు కేతుదోషముంటే...తేలికైన గులాబీ రంగు బట్టలు ధరించాలి. అటు దానాది కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. 

Also read: Navratri 2022 Date: శరన్నవరాత్రుల్లో భాగంగా ఇలా 9 రోజుల పాటు పూజ కార్యక్రమాలు చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News