Shani Sadhesati 2023: రేపు ఈ రాశులకు శని పీడ నుండి విముక్తి.. ఇక వీరికి లక్కే లక్కు..
Shani Sadhesati 2023: రేపు కుంభరాశిలో శనిదేవుడు సంచరించిన వెంటనే కొందరిపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభమై.. మరికొందరిపై ముగుస్తుంది.
Shani Transit In Kumbh: ఆస్ట్రాలజీలో అత్యంత ముఖ్యమైన గ్రహా సంచారం జరగబోతుంది. జనవరి 17న శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో (Saturn transit in Aquarius 2023) సంచరించనుంది. శని గోచారం వల్ల కొందరిపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభమైతే.. మరికొందరు దాని నుండి విముక్తి పొందుతారు. సాధారణంగా శనిదేవుడు అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు.
శని సడేసతి నుండి ఈ రాశులకు విముక్తి
జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలో సంచరించిన వెంటనే.. మిథున, తుల రాశుల వారికి శని ధైయా నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా వీరి పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు కోరిక నెరవేరుతుంది.
శనిదేవుడు కుంభంలోకి ప్రవేశించిన వెంటనే ధనుస్సు రాశి వారికి సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రాశులపై శని సడేసతి ప్రారంభం..
శనిదేవుడు కుంభరాశిలో సంచరించిన వెంటనే మీనం, కుంభం మరియు మకర రాశి వారిపై సడే సతి మెుదలవుతుంది. ఈ సమయంలో ఈ రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Surya Dev: సూర్య గోచారం వల్ల ఈరాశులకు గోల్డెన్ డేస్.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook