Shani Dev Puja Rules: మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని అంటారు. శనివారం నాడు శనిదేవుడిని (Shani Dev) పూజించడం ద్వారా శని మహాదశ, ధైయా మరియు సడేసతి నుండి విముక్తి పొందుతారు. మనం తప్పుడు పనులు చేస్తే శనిదేవుడు శిక్షిస్తాడు కాబట్టి శనిదేవుడిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు. ముఖ్యంగా శనిదేవుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. లేదంటే శని వక్రదృష్టి మీపై పడి జీవితం సర్వనాశనమవుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలు శని దేవుడిని ఎలా పూజించాలి?
>> శనిదేవుని దృష్టి ఎప్పుడూ మంచి మరియు చెడు పనులు చేసే వారిపైనే ఉంటుంది. స్త్రీలు జాతకంలో శని దోషం ఉన్నప్పుడు లేదా శని మహాదశ నుండి విముక్తి కోసం శని దేవుడిని పూజించవచ్చు.
>> శని దేవుడిని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. గ్రంధాల ప్రకారం, శని దేవుడి విగ్రహాన్ని తాకడం వల్ల మహిళలపై శని వక్ర దృష్టి పడుతుంది. 
>> శని దేవుడి విగ్రహానికి నూనె సమర్పించడం కూడా మహిళలకు నిషేధించబడింది. శనిని ప్రసన్నం చేసుకోవడానికి స్త్రీలు రావి చెట్టు క్రింద నూనె దీపం వెలిగించవచ్చు లేదా శని ఆలయంలో దీపం పెట్టవచ్చు.
>> శని అనుగ్రహం పొందడానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవాలి. దీని వల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది. 
>> శనివారం స్త్రీలు శనికి సంబంధించిన ఆవనూనె, నల్ల బట్టలు, నల్లని బూట్లు, ఇనుప పాత్రలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు వంటి వాటిని దానం చేయండి. ఇది శని దోషాన్ని పోగొడుతుంది. 


Also read: Navratri 2022 Date: శరన్నవరాత్రుల్లో ఈ పీఠాలను దర్శిస్తే చాలు.. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook