Shani Sade Sati and Dhaiya: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా శనిమహాదశను ఎదుర్కోవల్సి ఉంటుంది. మనం శనిదేవుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. అతడి బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనం చేసే తప్పు ఒప్పులను బట్టే శనిదేవుడు మన కర్మల నిర్ణయిస్తాడు. అందుకే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది పూజలు చేస్తారు. హునుమాన్ భక్తులపై కూడా శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. శని సడేసతి మరియు ధైయా యెుక్క  ప్రతికూల ప్రభావాలు మీపై ఉండకూడదంటే ఇలా చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి పరిహారాలు
** ప్రతి మంగళవారం సూర్యోదయానికి ముందే స్నానం చేసి హనుమంతుడిని పూజించండి. అంతేకాకుండా 'శ్రీ హనుమతే నమః' అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. 
** ప్రతి మంగళవారం ఉదయం రాగి పాత్రతో నీళ్లు తీసుకుని అందులో కుంకుమ వేసి ఆంజనేయుడికి అభిషేకం చేయండి. 
** ప్రతి శనివారం బజరంగ్ బలికి బెల్లం నూనె కలిపి చోళాన్ని సమర్పించడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు.
** శని, మంగళవారాల్లో కోతులకు బెల్లం, శనగలు తినిపిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
** శనిదేవుడు మిమ్మిల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు శనివారం నాడు హనుమాన్ చాలీసాను 100 సార్లు జపించాలి. 
** శనివారం హనుమాన్ ఆలయంలో మారుతిని పూజించి.. అనంతరం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల మీపై శనిదేవుడి కోపం తగ్గుతుంది. దీపం వెలిగించడానికి ఇంటి నుండి నూనె తీసుకురావాలి, ఎందుకంటే శనివారం నూనె కొనడం నిషేధం. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే దీపం వెలిగించడం మంచిది. 
**  దీపం వెలిగించటానికి ఇంటి నుండి బయటకు వెళితే తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడటం సరికాదు. చాలా ముఖ్యమైనది అయితే తప్ప.  


Also Read: Ketu Transit 2023: రివర్స్‌లో కదులుతున్న కేతువు... ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook