Shani Dev: శని దేవుని రాశి సంచారం వల్ల అన్ని రాశుల వారిలో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి స్థాయిలో ఉండడానికి శని దేవుడే కీలక పాత్ర పోషిస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. శని శుభ ప్రభావంతో జీవితంలో ఏదైనా చేయవచ్చు. కానీ దుష్ప్రభావానికి గురైతే జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొందరైతే ఈ క్రమంలో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శని జనవరి 17న త్రిభుజ రాశి అయిన కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం వల్ల రాజయోగం ఏర్పడబోతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రాజయోగం 12 రాశులపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ క్రమంలో పలు రాశుల వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యోగం వల్ల ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
శని సంచారం వల్ల మేష రాశి వారికి రాజయోగ గడియలు శుభప్రదంగా మారబోతున్నాయి. ఈ క్రమంలో మేష రాశి వారు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా వీరు ఖర్చులన్నీ తగ్గి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే.. కొత్త కొత్త వస్తువులు ఆస్తులు కొనే ఛాన్స్ కూడా ఉంది. ఈ యోగం వల్ల కొనుగోలు చేయాలని కోరికలను సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఊహించని లాభాలన్నీ పొందుతారు.


కన్యా రాశి:
శని రాజయోగం వల్ల కన్యా రాశి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారికి శని ఆరవ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని శుభప్రదం గానే ఉంటాయి. ఈ క్రమంలో కన్యా రాశి వారు ఏ పనులు చేసినా ధైర్యంగా చేయగలుగుతారు అంతేకాకుండా శత్రువులపై విజయాన్ని సాధించే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ సంచారం వల్ల కోర్టు వివాదాలు పరిష్కారమై ప్రశాంత జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం ఐశ్వర్యం లభిస్తుంది.


కుంభ రాశి:
ఏ సంచారాలు జరిగిన కుంభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాశిని లక్కీ రాశి అని కూడా అంటారు. ఇప్పుడు శని సంచారం వల్ల కుంభ రాశి వారు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నారు. ముఖ్యంగా ఈ సంచారం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సులభంగా ఉపశమనం పొందుతారు. అన్ని పనుల్లో జీవి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఇక వ్యాపారాల విషయానికొస్తే ఊహించని లాభాలు వందే అవకాశాలు ఉన్నాయి. పాత భూవివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గి ఆస్తిలో మార్పులు కూడా సంభవించవచ్చు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల పట్ల ఈ రాశుల వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..


Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook